ఏప్రిల్ 14 వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతున్న కెజిఎఫ్ 2 పై అంచనాలు ఎంతగా ఉన్నాయో ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే తెలుస్తుంది. కన్నడలో యశ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రికార్డులు సృష్టించాడు. ఇక హిందీలోనూ కెజిఎఫ్ 2 పై విపరీతమైన అంచనాలున్నాయి. అక్కడ షాహిద్ కపూర్ జెర్సీ మూవీ రిలీజ్ అవుతున్నా కెజిఎఫ్ 2 కి ఎలాంటి ఫికర్ లేదు.. ఇది మాస్ మూవీ, జెర్సీ క్లాస్ మూవీ అంటూ మేకర్స్ ధైర్యంగా ఉన్నారు.
ఇక తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా కెజిఎఫ్ తో బాక్సాఫీసుని షేక్ చేసిన యశ్ అండ్ ప్రశాంత్ నీల్ ద్వయానికి.. ఈసారి మరింత క్రేజ్ వచ్చేసింది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో కెజిఎఫ్ 2 కి కళ్ళు చెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అందరికి షాకిచ్చింది. ఓ ప్రాంతీయ చిత్రం ఇక్కడ తెలుగులో ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే నిజంగా మాటలు కాదు.. కెజిఎఫ్ 2 రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు మీ కోసం
ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం 50 కోట్లు
సీడెడ్ 20 కోట్లు
ఉత్తరాంధ్ర 10 కోట్లు
గుంటూరు 8 కోట్లు
ఈస్ట్ 8 కోట్లు
వెస్ట్ 7 కోట్లు
కృష్ణ 6 కోట్లు
నెల్లూరు 3.5 కోట్లు
ఏపీ అండ్ టీఎస్ టోటల్: 112.5 కోట్లు