ట్రిపుల్ ఆర్ మూవీలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి గా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చారు. అటు ఎన్టీఆర్ కి కొమరం భీమ్ గా ఎలివేషన్ సన్నివేశాలు ఉన్నాయి. ఇటు చరణ్ కి రామ రాజుగా ఫాన్స్ కి నచ్చే ఎలివేషన్ సన్నివేశాలు ఉన్నాయి. కానీ కొంతమంది చరణ్ - తారక్ మధ్యన చరణ్ డామినేషన్ ఎక్కువ ఉంది అని, ఎన్టీఆర్ కన్నా చరణ్ కొన్ని చోట్ల హైలెట్ అయ్యాడని, చరణ్ కి ఎలివేషన్ సీన్స్ ఎక్కువ అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసారు. అటు ఎన్టీఆర్ ఫాన్స్ లోను తారక్ ని రాజమౌళి ఎక్కడో తక్కువ చేశారేమో అను అనుమానం ఉంది.
అయితే తాజాగా రామ్ చరణ్ ని ట్రిపుల్ ఆర్ ముంబై పార్టీలో ఓ జర్నలిస్ట్ తారక్ కన్నా చరణ్ ఎక్కువ మార్కులు కొట్టేశాడని అనడంతో, వెంటనే చరణ్.. తారక్ పై తన డామినేషన్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అసలు డామినేషన్ అనే మాటను నేను ఒప్పుకోను అని.. అందులో ఎలాంటి నిజం లేదు. ఇద్దరం మా పాత్రలకి సరైన న్యాయం చేసాం. కొమరం భీం గా తారక్ నటన చాలా అద్భుతంగా ఉంది. తారక్ నా ప్రయాణం సూపర్ గా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళికి కృతజ్ఞతలు. నా కెరీర్ లో ఈ సినిమాను ఆస్వాదించినంతగా ఏ సినిమానూ ఆస్వాదించలేదు.. అంటూ చరణ్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.