Advertisementt

RRR ముంబై పార్టీలో సెలబ్రిటీస్ సందడి

Thu 07th Apr 2022 12:23 PM
rrr,rrr mumbai party,rrr movie,rajamouli,bollywood celebrities,rrr success bash,ntr,ram charan,karan johar,aamir khan  RRR ముంబై పార్టీలో సెలబ్రిటీస్ సందడి
Aamir Khan parties with Rajamouli at RRR success bash RRR ముంబై పార్టీలో సెలబ్రిటీస్ సందడి
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ అన్ని భాషల్లోనూ సక్సెస్ జెండా ఎగరవేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకేసారి పాన్ ఇండియా మార్కెట్ లో హీరోలుగా జెండా పాతేశారు. రాజమౌళి బాహుబలి హైప్ ని అంచనాలను నిలబెట్టుకున్నారు. అంత సక్సెస్ సాధించిన ట్రిపుల్ ఆర్ టీం కి హైదరాబాద్ లో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పెషల్ గా పార్టీ ఆరెంజ్ చేసారు. హైదరాబాద్ లోని ఎన్ కన్వేషన్ లో ట్రిపుల్ టీం కి టాప్ డైరెక్టర్స్ కి ఇంకొంతమంది ప్రముఖులకు అదిరిపోయే పార్టీ ఇచ్చారు. అయితే తాజాగా ఆర్ ఆర్ టీం కి ముంబై లోను ఓ పార్టీ జరిగింది.

హిందీలో ట్రిపుల్ ఆర్ రైట్స్ ని దక్కించుకున్న పెన్ మూవీస్ వారు ఈ పార్టీకి హోస్ట్ గా వ్యవహరించారు. ట్రిపుల్ ఆర్ గ్రాండ్ సక్సెస్ ముంబై పార్టీకి అక్కడి టాప్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. అందులో అమీర్ ఖాన్, బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, ఇంకా జావేద్ అక్తర్ తో పాటుగా పలువురు ప్రముఖులు హాజరైన ఈ పార్టీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ ముంబై పార్టీ క్లిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Aamir Khan parties with Rajamouli at RRR success bash:

Bollywood Celebrities parties with Rajamouli at RRR success bash

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ