పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఆయన లుక్ విషయంలో చాలా లైట్ గా ఉంటున్నారు. కొద్దిగా వెయిట్ కూడా పెరిగి కాస్త లావుగా కనిపిస్తున్నారు. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక పవన్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల్లో కొద్దిగా బొద్దుగానే కనిపించారు. అప్పుడెప్పుడో బెంగుళూరు ట్రైనర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ వర్కౌట్స్ చేస్తూ బాడీ షేప్ చేస్తున్నారు, బరువు తగ్గి లుక్ మార్చబోతున్నారు అన్నప్పటికీ పవన్ బరువు లో ఎలాంటి తేడా కనిపించలేదు. కానీ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు యుద్ధ శిక్షణలో కత్తి సాము చేస్తూ, ఇంకా కొన్ని విలు విద్యలు నేర్చుకుంటూ ఉన్న పిక్స్ ని వదిలారు మేకర్స్.
ఆ లుక్ లో పవన్ కళ్యాణ్ బాగా బరువు తగ్గినట్టుగా కనిపిస్తున్నారు. ఆ రెండు సినిమాల కన్నా పవన్ హరి హర వీరమల్లు మూవీ లుక్ లో చాలా వేరియేషన్ చూపించినట్టుగా అనిపిస్తుంది. హెయిర్ పెంచారు, సన్నబడ్డాడు. రాజకీయాలు, సినిమా షూటింగ్స్ తో క్షణం తీరిక లేని పవన్ కళ్యాణ్ జిమ్ చెయ్యడం తగ్గించారేమో అనుకున్నారు కానీ.. రీసెంట్ గా పవన్ లుక్ చూస్తే బరువు బాగా కంట్రోల్ లో పెట్టినట్టుగా అనిపిస్తుంది. హరి హర వీరమల్లు లో పవన్ కాస్త స్లిమ్ గా కనిపిస్తారేమో అని పవన్ ఫాన్స్ ఆశపడినట్లుగానే పవన్ లుక్ లో వేరియేషన్ మాత్రం కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది.. ప్రెజెంట్ పవన్ లుక్.