Advertisementt

వచ్చినవన్నీ ఒప్పేసుకుంటే కష్టం: నిధి

Wed 06th Apr 2022 08:14 PM
nidhi agarwal,hari hara veeramallu movie,pawan kalyan,ismart shankar,kollywood actor simbu  వచ్చినవన్నీ ఒప్పేసుకుంటే కష్టం: నిధి
Nidhi Agarwal on career వచ్చినవన్నీ ఒప్పేసుకుంటే కష్టం: నిధి
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లోకి అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య - అఖిల్ సరసన నటించినా రాని క్రేజ్ ఇస్మార్ట్ శంకర్ లో చూపించిన అందాలతో ఒక్కరిగా పాపులర్ అయ్యింది నిధి అగర్వాల్. ఎక్కువగా అందాల ఆరబోతతోనే హైలెట్ అయిన నిధి అగర్వాల్ ఇప్పుడు నటనకు ప్రాధాన్యం ఉన్న మూవీ చేస్తుంది. అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పక్కన హరి హర వీరమల్లు సినిమాలో యువరాణి పాత్రలో మెరవబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన నిధి లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. 

అయితే ఈమధ్యన నిధి అగర్వాల్ కోలీవుడ్ స్టార్ హీరో శింబు ని వివాహం చేసుకోబోతుంది అనే టాక్ నడుస్తుంది. తాజాగా నిధి అగర్వాల్ కి అదిరిపోయే అందం ఉన్నప్పుడు ఆచి తూచి సినిమాలు చెయ్యడం ఏమిటి అనే ప్రశ్న ఎదురైంది. దానితో నిధి మాట్లాడుతూ.. వరసగా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ నేనే ఒప్పుకోవడం లేదు , వచ్చిన సినిమా అలా దూకుడుగా ఒప్పుకుంటూ పొతే, ఎంత త్వరగా ఎదుగుతామో, ఎంత త్వరగా క్రేజ్ తెచ్చుకుంటామో అంతే త్వరగా ఫెడవుట్ అవుతాము.. అందుకే నిదానంగా సినిమాలు ఒక్కొక్కటిగా ఒప్పుకుంటున్నాను.. అలా అయితే కొన్నాళ్ళు హీరోయిన్ గా నిలబడతామని, సినిమాల్లో సక్సెస్ అవ్వాలంటే ఆ మాత్రం ఓపిక, సహనం ఉండాలి అంటూ లెక్చర్ ఇస్తుంది నిధి అగర్వాల్.

Nidhi Agarwal on career :

Nidhi Agarwal on movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ