విజయ్ హీరోగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు మూడు లాంగ్వేజెస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న Thalapathy66 అఫీషియల్ గా పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టారు. ఈ నెల 13 న విజయ్ బీస్ట్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ముగించుకున్న విజయ్ వంశి పైడిపల్లి ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ లోకి అడుగుపెట్టేసారు. వంశి పైడిపల్లి, దిల్ రాజు, విజయ్, విజయ్ తో రొమాన్స్ చెయ్యబోతున్న రష్మిక మందన్న పాల్గొన్న Thalapathy66 పూజ కి సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వంశి పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్ట్మాకంగా మొదలైన ఈ సినిమాకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ప్రస్తుతం నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్న థమన్ పని చేస్తున్నారు. ఇంకా #Thalapathy66 ఓపెనింగ్ కార్యక్రమంలో దిల్ రాజు బ్రదర్ శిరీష్, ఆయన కూతురు ఇంకా కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ లు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలతో నేడు మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూట్ కూడా ఈ రోజే మొదలు కాబోతున్నట్టుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు.