బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అలియా భట్ పెళ్లి పీటలెక్కడానికి ముహూర్తం కుదిరింది అంటున్నారు. తనకి ఇష్టమైన రణబీర్ కపూర్ తో ఏడడుగులు నడవడానికి కపూర్స్ ఫ్యామిలీ వీళ్ళ పెళ్లి కి తేదీ ఫిక్స్ చేసారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నా అలియా భట్ కానీ, రణబీర్ కపూర్ కానీ ఈ పెళ్లి విషయమై ఎక్కడా స్పందించడం లేదు. అలియా భట్ - రణబీర్ కపూర్ ల వివాహం ఈ నెల 17 న ముంబై లోనే జరగబోతుంది అని తెలుస్తుంది.
అది కూడా కపూర్స్ ఫ్యామిలికి అచ్చొచ్చిన ముంబై లోని ఆర్కే మహల్ లో వీరి పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట. అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్ళికి 450 మంది అతిధులకు ఆహ్వానం ఉండబోతుంది అని, అందులో రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, సంజయ్ లీల భన్సాలీ లాంటి బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానాలు ఇప్పటికే అందాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అలియా భట్ తాతగారి ఆరోగ్యం బాగోకపోవడం వలనే వీరి పెళ్లిని ఇంత త్వరగా చెయ్యాలని ఇరు ఫ్యామిలీ మెంబెర్స్ నిశ్చయించాయట. ఇక పెళ్లి తర్వాత అలియా - రణబీర్ ల రిసెప్షన్ ని గ్రాండ్ గా అర్రెంజ్ చేయబోతున్నారట.