బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాక ఏ లాస్ట్ టు వీక్స్ లోనో కంటెస్టెంట్స్ కోచ్చిన క్రేజ్ తో ఫాన్స్ వాళ్ళని సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యడం చూస్తున్నాం. కానీ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో ఒక కంటెస్టెంట్ తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం అందరికి షాకిస్తుంది. ఆమె ఎవరో కాదు.. బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆటతో, మైండ్ గేమ్ తో దూసుకుపోతున్న బిందు మాధవి. టైటిల్ ఫెవరెట్ అఖిల్ కే బిందు మాధవి వరస షాక్ లు ఇస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పడం, మనసులో ఎలాంటి భయం లేకుండా ఓపెన్ గా మాట్లాడడం, గొడవకైనా దేనికైనా రెడీ గా ఉండడం, నటరాజ్ మాస్టర్ లాంటి వాళ్ళకే చుక్కలు చూపించడం వంటి విషయాలతో బిందు మాధవి తెగ హైలెట్ అవుతుంది.
అయితే బిందు మాధవి మొదటి వారం నుండి నామినేషన్స్ లోకి వస్తుంది. అయినా స్ట్రాంగ్ గానే నిలబడుతుంది. ఈ వారం కూడా నామినేషన్స్ లోకి వచ్చిన బిందు మాధవి సేవ్ అవ్వాలంటూ ఆమె ఫాన్స్ ట్విట్టర్ లో బిందు మాధవిని నేషనల్ వైడ్ గా ట్రెండ్ చెయ్యడం ఆకర్షించింది. గత రాత్రి ట్విట్టర్ లో బిందు మాధవి నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవడంతో ఆమె ఫాన్స్ ఆమె బిగ్ బాస్ టైటిల్ గెలవడం ఖాయంగా అంటున్నారు. మరి హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ తో బిందు మాధవి పోరాడి టైటిల్ గెలవాలని, ఈ వారం ఆమెని సపోర్ట్ చెయ్యాలంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.