సమంత - నాగ చైతన్య విడాకులు తీసుకున్నప్పుడు వేణు స్వామి అనే ఆస్ట్రాలజర్ మీడియాలో తెగ హైలెట్ అయ్యారు. ఎందుకంటే సమంత - చైతు వాళ్లిద్దరూ విడిపోతారని నేను ముందే చెప్పాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడమే కాదు, అఖిల్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవుతుంది అని కూడా చెప్పినట్లు ఆయన చెప్పి షాకిచ్చారు. అయితే తాజాగా మరోసారి వేణు స్వామి న్యూస్ లోకి వచ్చారు. ఎందుకంటే ఆయన సెలబ్రిటీస్ జాతకాలు చెప్పేసారు కాబట్టి. నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత జాతకం చాలా బావుంది అని, ఆమె పై గత ఏడాది ఉన్న నెగిటివిటి ఏ ఏడాది చాలావరకు తగ్గింది అని చెబుతున్నారు.
అంతేకాకుండా సమంత కి 2024 వరకు తిరుగు లేదని చెబుతున్నారు. ఆయన చెప్పింది నిజమే కావొచ్చు. ఎందుకంటే సమంత ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్, హాలీవుడ్ మూవీస్ అంటూ ఊపిరాడకుండా సినిమాలు చేసేస్తుంది. మరోపక్క పూజ హెగ్డే, రష్మిక జాతకులకు తిరుగులేదని చెబుతున్నారు ఈ ఆస్ట్రాలజర్. ఇంకా టాలీవుడ్ కి అల్లు అర్జున్ బంగారు బాతులాంటివాడు అని చెప్పిన ఆయన అల్లు అర్జున్ కి మరో ఐదేళ్లు తిరుగుండదు అని చెప్పారు. అఖిల్ కి నాగ దోషం ఉంది అని, ఆయన ఎవరి సలహాలు తీసుకోకుండా సినిమాలు చేస్తే హిట్ కొడతాడని చెప్పిన వేణు స్వామి.. ప్రభాస్ జాతకం పై షాకింగ్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ప్రభాస్ జాతకం బాగోలేదని, అందుకే ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు ఆలోచించుకుంటే మంచిదని చెబుతున్నారు సదరు ఆస్ట్రాలజర్.