కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఏప్రిల్ 13 అంటే తమిళ సంవత్సరాది సందర్భంగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించిన బీస్ట్ మూవీ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాపై విజయ్ ఫాన్స్ లోనే కాదు, ఆడియన్స్ లోను విపరీతమైన హైప్ ఉంది. ఈ సినిమా కేవలం కోలీవుడ్ లోనే కాదు, తెలుగు, హిందీ భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. రీసెంట్ గానే తెలుగులో బీస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసారు. తెలుగులో దిల్ రాజు బీస్ట్ మూవీ ని రిలీజ్ చేస్తున్నారు. కెజిఎఫ్ 2 కి చెక్ పెట్టేందుకు విజయ్ అండ్ టీం అన్ని రకాలుగా సిద్దమవుతుంది.
ఈ నేపథ్యంలో విజయ్ కి దుబాయ్ ప్రభుత్వం షాకిచ్చింది. బీస్ట్ మూవీ ని దుబాయ్ లో రిలీజ్ కాకుండా నిషేధించడం హాట్ టాపిక్ గా మారింది. బెస్ట్ సినిమాలో టెర్రరిస్ట్ లు, కిడ్నాప్, హైజాక్ లాంటి కథనంతో తెరకెక్కడంతో దుబాయ్ సెన్సార్ బోర్డు వారు హైజాక్, టెర్రరిస్ట్ అనే పదాలు విరివిగా వాడడంతో ఆ దేశంలో బీస్ట్ మూవీని బాన్ చేసినట్లుగా తెలుస్తుంది. దుబాయ్ లో తప్పు చేసిన వారికి కఠినమైన శిక్షలు ఉంటాయనేది తెలిసిందే. అందుకే బీస్ట్ సినిమాని దుబాయ్ లో బ్యాన్ చేసిందట అక్కడి ప్రభుత్వం. విజయ్ ఫాన్స్ బీస్ట్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తుంటే విజయ్ కి దుబాయ్ గవర్నమెంట్ షాకిచ్చింది.