Advertisementt

వావ్ అనిపిస్తున్న రష్మిక బర్త్ డే సర్ ప్రైజ్ లు

Tue 05th Apr 2022 04:24 PM
rashmika mandanna,rashmika,rashmika mandanna birthday special,rashmika birthday,thalapathy66,hanu raghavapudi,animal movie  వావ్ అనిపిస్తున్న రష్మిక బర్త్ డే సర్ ప్రైజ్ లు
Rashmika Mandanna Birthday Special వావ్ అనిపిస్తున్న రష్మిక బర్త్ డే సర్ ప్రైజ్ లు
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న ఇప్పుడు ఏ స్టార్ హీరో నోట చూసిన ఆమె పేరే. పుష్ప మూవీ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన రష్మిక... స్టార్ హీరోయిన్స్ కి అన్ని భాషల్లో షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా మారిన రష్మిక అటు బాలీవుడ్ లో పాగా వెయ్యడానికి ట్రై చేస్తుంది. అలాగే తమిళ లోను రష్మిక సక్సెస్ కోసం తాపత్రయ పడుతుంది. మరోపక్క మలయాళంలోనూ రష్మిక ఎంట్రీ ఖరారైపోయింది. నేడు రష్మిక పుట్టిన రోజు. ఆమె పుట్టిన రోజు స్పెషల్ గా రశ్మికని తమ ప్రాజెక్ట్స్ లోకి ఆహ్వానిస్తూ అఫీషియల్ గా ప్రకటనలు ఇస్తున్నారు మేకర్స్. అందులో ముఖ్యంగా రష్మిక తమిళ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న Thalapathy66 ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఓకె అవడమే కాదు, వంశి పైడిపల్లి - విజయ్ కలయికలో మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలోకి రశ్మికని ఆహ్వానిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.

అంతేకాకుండా రష్మిక రీసెంట్ గానే బాలీవుడ్ లో మరో బడా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ వంగ తెరకెక్కిస్తున్న యానిమల్ లో రష్మిక హీరోయిన్. అది మాత్రమే కాదు.. రష్మిక బర్త్ డే స్పెషల్ గా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్-హను రాఘవపూడి కలయికలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో రష్మిక రెగ్యులర్ గ్లామర్ పాత్ర కాకుండా.. ఆమె అఫ్రీన్ అనే కాశ్మీరీ ముస్లిం అమ్మాయి గా వీరోచిత పాత్రలో కనిపిస్తుంది. ఎరుపు రంగు హిజాబ్ ధరించి, హ్యాండ్‌బ్యాగ్‌ ని వేసుకుని, ఆమె కళ్లలోని  సీరియస్ నెస్, తీవ్రతను రష్మిక లుక్ లో రివీల్ చేసారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా నేడు రష్మిక మందన్నను ప్రాజెక్ట్‌ లో భాగమని వెల్లడించడం ద్వారా మేకర్స్ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

సో రష్మిక బర్త్ డే రోజున ఇలాంటి భారీ ప్రాజెక్ట్స్ ప్రకటనతో మేకర్స్ ఆమెకి స్పెషల్ విషెస్ తెలియజేసారు.

Rashmika Mandanna Birthday Special:

Rashmika Mandanna New projects announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ