Advertisementt

డిఫ్రెంట్ గెటప్ లో రామ్ చరణ్

Tue 05th Apr 2022 01:41 PM
ram charan,rc15,shankar,rangastalam,rrr movie,alluri,chitti babu  డిఫ్రెంట్ గెటప్ లో రామ్ చరణ్
Ram Charan in Different Getup డిఫ్రెంట్ గెటప్ లో రామ్ చరణ్
Advertisement
Ads by CJ

రంగస్థలం లో చిట్టిబాబు గా వినికిడి లోపం ఉన్న పల్లెటూరి మొరటోడు పాత్రలో రామ్ చరణ్ నిజంగా ఆడియన్స్ మనసు దోచేశారు. ఆ సినిమాలో రామ్ చరణ్ పెరఫార్మెన్స్ నిజంగా అద్భుతమే. ఇక రీసెంట్ గా వచ్చిన ట్రిపుల్ ఆర్ లోను పోలీస్ అధికారిగా, అల్లూరి సీతారామరాజు గెటప్స్ లో రామ్ చరణ్ మేకోవర్ కి అందరూ ఫిదా అయ్యారు. అల్లూరిగా రామ్ చరణ్ గెటప్ మాత్రమే కాదు, ఆయన పెరఫార్మెన్స్, ఫేస్ ఎక్సప్రెషన్స్ అన్ని సూపర్బ్ అనేలా ఉన్నాయి. ఇక RC 15 లో రామ్ చరణ్ గెటప్ పై అందరిలో క్యూరియాసిటీ, ఆసక్తి రెండూ మొదలయ్యాయి. అయితే రామ్ చరణ్ RC 15 లో నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలుస్తుంది. 

అందులో ఒకటి పల్లెటూరి గెటప్ లో వైట్ అండ్ వైట్ లుంగీ లో కనిపిస్తారని.. ఓ లీకెడ్ పిక్ చెబుతుంది. భారతీయుడు మూవీలో కమల్ హాసన్‌లా డిఫరెంట్ లుక్ లో చరణ్ కనిపిస్తారని అన్నట్టుగానే ఈ వైట్ డ్రెస్ లుక్ ఉంది. చరణ్ సైకిల్ మీద వెళుతున్న పిక్ అది. ఇంకా కలెక్టర్, యంగ్ మ్యాన్, ఓల్డ్ ఏజ్డ్ కేరెక్టర్ తో RC 15 లో చరణ్ ని ఇప్పటివరకు చూడని లుక్స్ లో శంకర్ చూపించబోతున్నారట. చరణ్ క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా పదునైన సీన్స్ రాసుకున్నారట శంకర్. ఇక ప్రస్తుతానికి రెండు భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న RC15 మూడో షెడ్యూల్ ఏప్రిల్ 6 నుండి మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Ram Charan in Different Getup:

Is Ram Charan look from RC15 leaked?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ