రామ్ చరణ్ రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ తో ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా ఫిలిం లో అద్భుతంగా చెలరేగిపోయారు. అల్లూరి గా, బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ గా చరణ్, కొమరం భీముడా అంటూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. అయితే చాలామంది ఎన్టీఆర్ ని అల్లూరిగా, కొమరం భీమ్ గా చరణ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఊహించుకోవడమే కాదు, ఎన్టీఆర్ ని చరణ్ ని ఆ ప్రశ్న అడిగినా.. మేము అలా ఎప్పుడూ అనుకోలేదు. అన్నారు. రాజమౌళి అయితే కొమరం భీమ్ గా అమాయకమైన ట్రైబల్ గా ఎన్టీఆర్ న్యాయం చెయ్యగలడు, చరణ్ అల్లూరిగా న్యాయం చెయ్యగలడు, మనసులో దాచుకుని ఎక్సప్రెషన్స్ తో ఎన్టీఆర్ బాగా నటిస్తాడు అంటూ చెప్పారు.
అయితే తాజాగా ట్రిపుల్ ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ విషయమై స్పందిస్తూ.. రామ రాజు పాత్రలో తారక్ అద్భుతంగా నటించేవాళ్లే కానీ.. భీమ్ పాత్రలో మాత్రం చరణ్ పూర్తిగా న్యాయం చెయ్యలేకపోయేవారని చెప్పారు. ఎందుకంటే భీమ్ పాత్రకి కావాల్సిన మొరటు తనం చరణ్ లో లేదని చెప్పిన ఆయన.. ట్రిపుల్ ఆర్ మొదలు పెట్టేటప్పుడే భీమ్ కి చరణ్, ఎన్టీఆర్ రామరాజుగా చేస్తే ఎలా ఉంటుంది అనే డిస్కర్షన్స్ జరిగాయని, భీమ్ లాంటి అమాయకమైన వైల్డ్ పాత్రకి ఎన్టీఆర్ నటన బావుంటుంది అని, అలాగే కళ్ళతోనే ఎక్సప్రెషన్స్ ఇవ్వగల రామ్ చరణ్ రామరాజు పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారనే రాజమౌళి ఆ పాత్రలని ఎన్టీఆర్, చరణ్ కి కేటాయించినట్టుగా చెప్పుకొచ్చారు.