Advertisementt

బిగ్ బాస్: ఈ వారం నామినేషన్స్ డీటెయిల్స్

Tue 05th Apr 2022 10:33 AM
bigg boss,bigg boss non stop,bigg boss sixth week,nominations list,ariyana,akhil  బిగ్ బాస్: ఈ వారం నామినేషన్స్ డీటెయిల్స్
Bigg Boss Non Stop: 6th Week Nomination details బిగ్ బాస్: ఈ వారం నామినేషన్స్ డీటెయిల్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ప్రతి వారం నామినేషన్స్ హీట్ ఎలా ఉంటుందో గత రాత్రి అంటే సోమవారం నామినేషన్ హీట్ అలానే ఉంది. గత వారం ఎలాంటి అంచనాలు లేని తేజస్వి నామినేట్ అవడం అందరికి షాకివ్వగా.. ఈ వారం నామినేషన్స్ లో తేజసి ఎఫెక్ట్ కనిపించింది. ఇక ఈవారం ఇద్దరిని నామినేట్ చేస్తూ తగిన కారణాలు చెప్పి మంటల్లో ఫోటో ని కాల్చాలంటూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి చెప్పాడు. దానితో ముందుగా అరియానని నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టమని చెప్పగా అరియనా ఇద్దరిని నామినేట్ చేసింది. తర్వాత అజయ్ రాగా.. అజయ్ కి హామీదకి ఓ వర్డ్ దగ్గర పెద్ద గొడవే జరిగింది. 

అనిల్ తనని నామినేట్ చేసాడని కచ్ఛితో నటరాజ్ మాస్టర్ అనిల్ ని నామినేట్ చెయ్యకుండా నీతో ఇక్కడే ఉండి గేమ్ ఆడతా అంటూ.. స్రవంతిని, బిందు మాధవిని నామినేట్ చేసాడు. స్రవంతికి నటరాజ్ మాస్టర్ కి, నటరాజ్ మాస్టర్ కి బిందు మాధవికి గట్టిగానే గొడవ జరిగింది. ఇక ఎక్కువగా మిత్ర శర్మని నామినేట్ చెయ్యడంతో ఆమె రెచ్చిపోయింది. యాంకర్ శివ విషయంలో మిత్ర చాలా ఓవర్ చేసింది. అతన్ని ఇమిటేట్ చేస్తూ గార్డెన్ ఏరియా లో నానా యాగీ చేసింది చివరికి మీరు శివని ఏ కారణంగా నామినేట్ చేస్తున్నారో చెప్పమని బిగ్ బాస్ హెచ్చరికలతో ఏదో కారణం చెప్పి తప్పించుకుంది. 

బిందు మాధవి ఆశు రెడ్డిని, నటరాజ్ ని నామినేట్ చెయ్యగా ఆశు రెడ్డి కి బిందు మాధవికి వాదోపవాదనలు జరిగాయి. ఇక అఖిల్ కెప్టెన్ గా ఆశు ని మిత్ర ని నామినేట్ చేసాడు. అక్కడ బిందు కి అఖిల్ కి ఫైట్ జరిగింది. నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో.. ఈ వారం మిత్ర శర్మ, నటరాజ్, మహేష్, అషు రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్‌లు నామినేషన్స్ లోకి వెళ్లగా కేవలం అరియనా, కెప్టెన్ అఖిల్ మాత్రం తప్పించుకుని సేవ్ అయ్యారు.

Bigg Boss Non Stop: 6th Week Nomination details:

Bigg Boss non stop sixth week nominations list

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ