అఖండ లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు మళ్ళీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లోనే నటిస్తున్నారు. క్రాక్ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని తో బాలయ్య జత కట్టారు. లీకెడ్ పిక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ కాంబో. బాలకృష్ణ ని ఎన్నడూ చూడని విధంగా మాస్ అవతార్ లో గోపీచంద్ మలినేని చూపించబోతున్నారు. బాలయ్య లుంగీ కట్టి బ్లాక్ షర్ట్ తో డిఫ్రెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఒకటి మాస్ అవతార్ కాగా.. మరొకటి స్టైలిష్ బాలయ్య ని ఈ సినిమాలో చూస్తామట. స్టైలిష్ బాలయ్య కి జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా రెగ్యులర్ షూట్ తెలంగాణ లోని సిరిసిల్ల లో మొదలైంది. మొదటి షెడ్యూలే యాక్షన్ సన్నివేశాల తో మొదలైంది. బాలయ్య కి పవర్ ఫుల్ విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు.
మధ్యలో చిన్నపాటి బ్రేక్ తో తదుపరి షెడ్యూల్ ఈ రోజు మంగళవారం నుండి సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో మొదలు కాబోతుంది. ఒక షెడ్యూల్ పూర్తి చేసిన గోపీచంద్ మలినేని.. ఇప్పుడు ఫైట్ మాస్టర్ రామ్ లక్షణ్ ఆధ్వర్యంలో కీలక యాక్షన్ ఘట్టాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కుతుంది అని, బాలయ్య డ్యూయెల్ రోల్ లో ఫాన్స్ కి కిక్ ఇవ్వడం ఖాయమని తెలుస్తుంది. సినిమా మొత్తంగా యాక్షన్ సన్నివేశాలతో పాటుగా బాలయ్య మాస్ లుక్ హైలెట్ కానుందట.