మెగాస్టార్ చిరు 60+ లోనూ ఎక్కడా తగ్గడం లేదు. వరస ప్రాజెక్ట్స్ తో ఉరుకులు పెడుతున్నారు. అటు సినిమాలే కాదు ఇటు యాడ్ షూట్స్ తోనూ బిజీగా వున్నారు. కొన్నాళ్ళు సినిమాలకి గ్యాప్ ఇచ్చిన చిరు మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు. అప్పట్లో యాడ్స్ లో నటించిన ఆయన మధ్యలో వచ్చిన గ్యాప్ తర్వాత మళ్ళీ యాడ్ షూట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా సుకుమార్ దర్శకత్వంలో చిరు శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ యాడ్ చేసారు. తన భర్యకి తెలియకుండా ఓ ఇల్లు కొని సర్ ప్రైజ్ చెయ్యాలనే ప్లాన్ తో అనసూయ తో కలిసి వెళ్లిన చిరు, తన భర్త తనని చీట్ చేస్తున్నారనుకుని ఆటోలో ఫాలో అయ్యి భర్త, అనసూయ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామనుకున్న భార్య ఖుష్బూ కి భర్త గా చిరు శుభగృహ రియల్ ఎస్టేట్ ఇల్లు గిఫ్ట్ గా ఇవ్వడం.. ఆ యాడ్ లో చూపించారు.
అయితే ఆ యాడ్ లో కనిపించడమే కాకుండా శుభగృహ రియల్ ఎస్టేట్ బ్రాండ్ అంసిడర్ గా ఉన్న చిరు కి పారితోషకం కింద 7కోట్లు గిట్టుబాటు అయినట్లుగా తెలుస్తుంది. మెగాస్టార్ లాంటి నటుడితో తమ కంపెనీకి యాడ్ చేపించడం వలన తమ కంపెనీ వాల్యూ పెరుగుతుందని.. ఆ శుభగృహ వారు చిరు కి ఏకంగా ఏడు కోట్లు చెల్లించారట. గతంలో అంటే ఓ 13 ఏళ్ళ క్రితం యాడ్స్ లో నటించిన చిరు మళ్ళీ ఇప్పుడు శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.