కొన్ని విషయాల్లో మీడియా అతి చేస్తుంది, అలాగే పరిధి దాటి ప్రవర్తిస్తుంది. అలాగని మీడియా అన్ని విషయాల్లో తప్పు చేస్తుంది అని చెప్పలేం. ఉదాహరణకు నిన్న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ పబ్ పై జరిగిన టాస్క్ ఫోర్స్ దాడిలో అనేకమంది సెలెబ్రిటీ పిల్లలు పట్టుబడ్డారు. అందులో రాజకీయ, సినీరంగాలకు చెందివారే ఎక్కువగా ఉండడంతో అది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ పబ్ లో పట్టుబడిన వారి పేర్లని బహిరంగంగా మీడియా అందరి ముందు ఉంచింది. అయితే ఆ పబ్ లో డ్రగ్స్ తీసుకున్నారు, కొకైన్ వాడారు, పోలీస్ లని చూడగానే బాత్ రూమ్ నుండి బయట పడేసే ప్రయత్నాలు కూడా చేసారని మీడియా లో వార్తలొచ్చాయి. అలాగే పట్టుబడిన ప్రముఖుల పిల్లల వీడియో క్లిప్పింగ్స్ మీడియాలో పదే పదే ప్రసారం అయ్యాయి.
వాళ్ళు చేసిన తప్పునే మీడియా చూపించింది. అంతేకాని కావాలని మీడియా వాళ్ళని ఇరికించలేదు కదా.. మా పిల్లలు డ్రగ్స్ తీసుకోవడం మీరు చూసారా.. మా పిల్లలు అలాంటి వారు కాదు అంటూ చాలామంది ప్రముఖులు మీడియా మీద విరుచుకుపడ్డారు. అసలు డ్రగ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా, తెల్లవఝామున మూడు గంటల వరకు పార్టీలో ఉండడమే తప్పు. అక్కడ వారు డ్రింక్ చేస్తే ఏమిటి, డ్రగ్స్ తీసుకుంటే ఏమిటి. అది మీడియాలో వస్తే తప్పు, వాళ్ళు మూడు గంటల వరకు పబ్ లో ఉంటే తప్పు కాదు. ఇదెక్కడి న్యాయమో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. వారు మంచి పనులు చేస్తే మీడియాలో పదే పదే వేస్తె సంతోషించేవారు, అదే తప్పుడు పని చేసి పేరు బయట పెడితే మీడియా అతి చేస్తుంది, ఓవర్ చేస్తుంది. ఇలా మాట్లాడం ఎంతవరకు కరెక్ట్.
ఛానల్స్ లో రావడం వలన మా కెరీర్ స్పాయిల్ అయ్యింది అంటూ కన్నీరు కారుస్తున్నవారు, పబ్ లో మూడు గంటల వరకు ఎంజాయ్ చేస్తే కెరీర్ నాశనం అవ్వదా.. ఇది ఇప్పుడు నెటిజెన్స్ వారికీ వేస్తున్న ప్రశ్న.