ఈ రోజు ఉదయం లేవగానే టివి ఛానల్స్ అన్నిటిలో బంజారాహిల్స్ రాడిసన్ పబ్ లో పలువురు సెలెబ్రిటీ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకి చిక్కి అరెస్ట్ అయ్యారు అనే న్యూస్ కనిపించింది. అందులో ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నిహారికల పేర్లు బాగా హైలెట్ అయ్యాయి. అరెస్ట్ అయిన కొద్దిసేపటికే నిహారిక, రాహుల్ లు విడుదలై ఇంటికి వెళ్ళిపోయినా మీడియా ఛానల్స్ లో మాత్రం ఆ న్యూస్ ప్రసారం అవుతూనే ఉంది. అయితే నిహారిక తండ్రి నాగబాబు నిహారిక డ్రగ్స్ తీసుకోలేదంటూ పోలీస్ లే చెప్పారు అని.. నిహారిక తప్పేం లేదు అని వివరణ ఇచ్చారు.
ఇక తాజాగా రాహుల్ సిప్లిగంజ్ కూడా తన అరెస్ట్ పై పలు ఛానల్స్ వేదికగా స్పందించాడు. తాను రాడిసన్ పబ్ కి తన ఫ్రెండ్ కి బర్త్ డే విషెస్ చెప్పడానికి వెళ్లిన సమయంలోనే టాస్క్ ఫోర్స్ దాడి జరిగింది అని, కానీ తాము వివరణ ఇచ్చే సరికే టాస్క్ ఫోర్స్ ఎంటర్ అయ్యింది అని, తాను అసలు రాడిసన్ పబ్ కి రావడం ఇది రెండోసారి మాత్రమే అని చెప్పుకొచ్చాడు. తాను ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటే గనక ఇప్పుడు ఇంట్లో ఉండను అని చెప్పిన రాహుల్.. తనపై మీడియాలో వస్తున్నవన్నీ అవాస్తవాలని, తాను అడ్డంగా పోలీస్ రైడ్ లో దొరికాను అంటూ ప్రసారం చెయ్యడం కరెక్ట్ కాదని చెబుతున్నాడు. అలాగే పబ్ నుండి బయటికి వెళ్లాలంటే ఓ పది పదిహేను నిముషాలు పడుతుంది అని, క్రౌడ్ ఎక్కువగా ఉండడం వలనే బయటికి వెళ్లడం ఆలస్యమైంది అని, అప్పటికే టాస్క్ ఫోర్స్ వచ్చింది అని చెప్పిన రాహుల్ తాను డ్రగ్స్ తీసుకున్న వ్యవహారంపై ఎలాంటి టెస్ట్ కైనా సిద్ధం అంటూ రాహుల్ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చాక పలు న్యూస్ ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇస్తున్నాడు.