గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు

Sun 03rd Apr 2022 12:56 PM
ashok galla,radisson blu hotel,pudding and wink pub,rahul sipligunj,niharika  గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు
Ashok Galla has nothing to do with it గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు

నిన్నరాత్రి హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లోను పుడ్డింగ్ అండ్ వింక్ పబ్ లో టాస్క్ ఫోర్స్ జరిపిన దాడుల్లో నగరానికి చెందిన ప్రముఖుల పిల్లలు చాలామంది పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ పబ్ లో డ్రగ్స్, కొకైన్ తీసుకుంటూ తెల్లవారు ఝాము వరకు పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అర్ధరాత్రి దాటినా పార్టీని నిర్వహించిన విషయాన్ని తెలుసుకున్న పోలీస్ లు ఆ పబ్ పై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, అలాగే మెగా డాటర్ నిహారిక కొణిదెల తో పాటుగా 150 మంది ప్రముఖుల పిల్లలతో పాటు పబ్ నిర్వాహకులని పోలీస్ లు అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ రైడింగ్ లో సెలబ్రిటీస్ పిల్లలు పట్టుబడడం హాట్ టాపిక్ గా మరింది. 

రాహల్ సిప్లిగంజ్ పోలీస్ స్టేషన్ క్లిప్పింగ్, నిహారిక కొణిదెల క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ దాడుల్లో పొలిటిషియన్ కొడుకు, డెబ్యూ హీరో కూడా పట్టుబడినట్లుగా కొన్ని మీడియా ఛానల్స్ లో వార్తలొస్తున్నాయి. ఆ పట్టుబడింది గల్లా జయదేవ్ అంటూ వార్తలు రావడంతో ఆయన ఫ్యామిలీ అలెర్ట్ అయ్యింది. నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో  గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.. అంటూ - గల్లా కుటుంబ సభ్యులు ఓ ప్రెస్ విడుదల చేసారు.

Ashok Galla has nothing to do with it:

Ashok Galla has nothing to do with raids at Pudding and Wink pub