బాలీవుడ్ లో పైకి ట్రిపుల్ ఆర్ సక్సెస్ ని పొగుడుతున్నట్టుగా కనిపిస్తున్నా.. అక్కడ చాలామందిలో టాలీవుడ్ ఇలా ఎదిగిపోవడాన్ని, ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూడడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కానీ పైకి మాత్రం టాలీవుడ్ సినిమాలని పొగుడుతున్నట్టే కనిపిస్తున్నారు. మరోపక్క చాలామంది బాలీవుడ్ స్టార్స్ తెలుగు సినిమాల్లో మెరుస్తున్నారు. అలాగే ఇతర భాషల మూవీస్ లోను నటిస్తున్నారు. కానీ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం మాత్రం తాను ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించను, డబ్బు కోసం వేరే భాషలో కానీ, తెలుగు లో కానీ నటించను అంటూ బిల్డప్ ఇచ్చాడు.
తాను నటించిన అటాక్ మూవీ ట్రిపుల్ ఆర్ ని మించి సక్సెస్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ తో బాగా ఎక్కువగా మట్లాడేసాడు. అప్పుడే ట్రిపుల్ ఆర్ మూవీ లవర్స్ జాన్ అబ్రహం ని ఆడుకున్నారు. ఇప్పుడైతే జాన్ అబ్రహం నెటిజెన్స్ కి అడ్డంగా దొరికిపోయాడు. అటాక్ మూవీ బాలీవుడ్ లో పెద్దగా సత్తా చాటలేకపోయింది. వారం తర్వాత కూడా అక్కడ ట్రిపుల్ హవా నే కొనసాగింది. జాన్ అబ్రహం ఎటాక్ మూవీ కి ఫస్ట్ డే మూడు కోట్లు మాత్రమే వచ్చాయి. ట్రిపుల్ ఆర్ కి వచ్చిన కలెక్షన్స్ లో సగం కూడా రాలేదన్నమాట. దానితో జాన్ అబ్రహం కి తగిన శాస్తి జరిగింది అంటూ బాలీవుడ్ ప్రేక్షకులే కామెంట్స్ చెయ్యడం గమనార్హం.