Advertisementt

ఉగాదికి ఊరమాస్ అంటున్న మహేష్

Sat 02nd Apr 2022 04:29 PM
mahesh babu,parasuram,sarkaru vaari paata update,sarkaru vaari paata movie,sarkaru vaari paata ugadi poster  ఉగాదికి ఊరమాస్ అంటున్న మహేష్
Sarkaru Vaari Paata Ugadi Special Poster ఉగాదికి ఊరమాస్ అంటున్న మహేష్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సర్కారు వారి పాట అంటూ చాలా స్టైలిష్ గా హ్యాండ్ సం గా కళావతి సాంగ్ లో కనిపించారు. అంతకుముందు మహేష్ కాస్త మాస్ లుక్ లో కనిపించినా.. ఇప్పుడు ఉగాది పోస్టర్ లో మాత్రం పక్కా మాస్ లుక్ లో దిగిపోయారు. పోకిరి షేడ్స్ ఉంటాయి సర్కారు వారి పాటలో మహేష్ పాత్రకి అంటూ మహేష్ కూడా రివీల్ చేసినట్టుగానే.. ఉగాదికి రివీల్ చేసిన పోస్టర్ చూస్తే మహేష్ ఫేస్ లో కోపం అన్ని మాస్ లుక్ ని తలపిస్తుంది. ఈ పోస్టర్ లో మహేష్ విలన్స్ తో యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు డిజైన్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఆయన చుట్టూ రౌడీలు కనిపిస్తున్నారు. మరి కళావతి తో క్లాస్ గా కనబడిన మహేష్ ఉగాది పోస్టర్ తో ఊర మాస్ గా కనిపిస్తున్నారు. 

ఈ ఉగాది పోస్టర్ తో సర్కారు వారి పాట నుండి ఎగ్జైటింగ్ అప్డేట్ సూన్ అంటూ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన రైల్వే స్టేషన్ సెట్ లో చిత్రీకరించిన కామెడీ సీన్స్ హైలెట్ కానున్నాయని, పరశురామ్ ఆ ఎపిసోడ్ ని హిలేరియస్ గా తెరకెక్కించారని టాక్. మే 12 న రిలీజ్ కాబోతున్న సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అయ్యి  ప్రస్తుతం ప్యాచ్ వర్క్ లో యూనిట్ బిజీగా వుంది. ఈ సినిమాలో మహేష్ బాబు మొదటిసారి కీర్తి సురేష్ తో రొమాన్స్ చేస్తున్నారు. 

Sarkaru Vaari Paata Ugadi Special Poster:

Get ready for exciting updates for Sarkaru Vaari Paata soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ