కోలీవుడ్ లో శివ కార్తికేయన్ - ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా కి మధ్యన పారితోషకం విషయం కోర్టువరకు వెళ్ళింది. తనకి నాలుగు కోట్ల పారితోషకం ఎగ్గొట్టడమే కాకుండా 11 కోట్లకి టిడిఎస్ కట్టలేదంటూ శివ కార్తికేయన్ జ్ఞానవేల్ రాజా పై కోర్టులో పిటిషన్ వేసాడు. అంతేకాకుండా తన డబ్బు చెలించేవరకు ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా ప్రొడక్షన్ నుండి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలని ఆపాలంటూ శివ కార్తికేయన్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే వీరి మధ్యన పారితోషకం రచ్చ నేను లోకల్ సినిమా అప్పటిది.
అయితే తాజాగా శివ కార్తికేయన్ పై జ్ఞానవేల్ రాజా ఫైర్ అవుతున్నారు. హీరో శివ కార్తికేయన్ కారణంగా తాను 20 కోట్ల నష్టపోయానంటూ జ్ఞానవేల్ రాజా కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. అసలైతే తనకు మిస్టర్ లోకల్ కథ నచ్చలేదని.. కానీ రాజేష్‌ను డైరెక్టర్‌గా పరిచయం చెయ్యడం కోసం శివ కార్తికేయన్ పట్టుబట్టి తనతో పెట్టుబడి పెట్టించి మిస్టర్ లోకల్ సినిమా చేయించారన్నారు ఆయన. ఆ హీరో కారణంగా నష్టపోయినందుకు గాను ఆ హీరోకి అపరాధభావం విధించి కేసు కొట్టేయాలంటూ జ్ఞానవేల్ రాజా తన పిటిషన్ లో కోర్టుని కోరుతున్నారు.