Advertisementt

రఫ్ లుక్ లో మాస్ పోలీస్ గా రామ్

Sat 02nd Apr 2022 11:32 AM
the warriorr,ram potineni,rapo19,lingu samy,krithi shetty  రఫ్ లుక్ లో మాస్ పోలీస్ గా రామ్
New racy poster from Lingusamy-RAPO The Warriorr released రఫ్ లుక్ లో మాస్ పోలీస్ గా రామ్
Advertisement
Ads by CJ

 

ఉగాదికి ఉస్తాద్ రామ్ పోతినేని రాపో (#RAPO) అభిమానులకు ఉగాది పండగ తీసుకొచ్చారు. ద వారియర్ లో రామ్ స్టైలిష్ పోలీస్ లుక్ అదుర్స్ అనేలా ఉండడమే కాదు.. మాస్ గా కనిపిస్తున్నాడు. రామ్ హీరోగా ది వారియర్.. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. 

ది వారియర్ లో రామ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ఖాకీ యూనిఫామ్ వేయడం ఆయన కెరీర్‌లో ఇదే తొలిసారి. సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు రామ్ పోలీస్ కేరెక్టర్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ లుక్‌లో షార్ట్ హెయిర్ కట్, మీసాలు, కళ్ళలో ఇంటెన్స్‌తో రామ్ కొత్తగా కనిపించారు. 

రిలీజ్ డేట్ పోస్టర్ లో గన్ పట్టుకుని సీరియ‌స్‌గా కనిపించిన రామ్ ఉగాదికి మాత్రం స్టైలిష్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పోలీస్ యూనిఫామ్ వేసుకుని మ్యాచో బైక్ మీద రామ్ వస్తుంటే... ఆయన యాటిట్యూడ్, స్వాగ్ అభిమానులు, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకూ విడుదలైన ప్రతి లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. రామ్ సరసన ఈ సినిమాలో విజిల్ మహాలక్ష్మి గా కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో జులై 14 న విడుదల కాబోతుంది.

New racy poster from Lingusamy-RAPO The Warriorr released:

 The Warriorr Ugadi Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ