ట్రిపుల్ ఆర్ సక్సెస్ అవడంతో హీరోలు రిలాక్స్ అవడం లేదు. ఎన్టీఆర్ అయితే బాలీవుడ్ మీడియా కి ఇంకా ఇంటర్వూస్ ఇస్తూ బిజీగా ఉంటే.. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సక్సెస్ ని తన బర్త్ డే తో ఎంజాయ్ చేసి.. తర్వాత వర్క్ లో బిజీ అయ్యారు. అంటే RC 15 షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు కానీ.. రామ్ చరణ్ మరో మూవీ తో ఈ నెలాఖరున ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అదే తన తండ్రి చిరు తో కలిసి నటించిన ఆచార్య మూవీ డబ్బింగ్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు.
కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య లో మెగాస్టార్ ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం తన పాత్రకి సంబందించిన డబ్బింగ్ ని చరణ్ శుక్రవారం మొదలుపెట్టాడు. సో ఎన్టీఆర్ అలా ఇంకా ట్రిపుల్ ఆర్ తో బిజీగా ఉంటే చరణ్ మాత్రం తన తదుపరి మూవీ ఆచార్య పనుల్లో బిజీగా వున్నారు. కొద్దిపాటి గ్యాప్ తో RC 15 షూటింగ్ కి చరణ్ జంప్ అవుతారని తెలుస్తుంది.