దేశం గర్వించదగ్గ దర్శకుల్లో రాజమౌళి నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకున్నట్టే కనిపిస్తుంది ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత. ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో ఆర్ ఆర్ ఆర్ అంటూ అద్భుతమైన సినిమాని ఆడియన్స్ కి అందించి ఆ సక్సెస్ ని ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నారు రాజమౌళి. ట్రిపుల్ ఆర్ తెరకెక్కించడానికి ఎంతగా కష్టపడ్డారో.. ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ విషయంలోనూ రాజమౌళి అంతే కష్ట పడ్డారు. అయితే ట్రిపుల్ ఆర్ ముచ్చట ముగియగానే అందరూ మహేష్ తో రాజమౌళి చెయ్యబోయే ప్రాజెక్ట్ విషయాలను తవ్వుతున్నారు. ఆ మధ్యన రాజమౌళి ఇది మల్టీస్టారర్ కాదు, సింగిల్ స్టార్ మూవీ నే.. అలాగే మహేష్ స్టోరీ రెడీ అయినా నేను ఇంకా వినలేదు అని మాత్రమే చెప్పారు. ఇక రాజమౌళి వెకేషన్స్ కి వెళ్లొచ్చాక మహేష్ స్క్రిప్ట్ పై కూర్చుంటారు.. అంటే జూన్, జులై నుండి సినిమా మొదలవుతుంది అనుకుంటున్నారు మహెష్ ఫాన్స్.
కానీ రాజమౌళి రీసెంట్ గా మహేష్ మూవీపై బిగ్ అప్ డేట్ ఇచ్చారు. ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ మూవీ గురించి మట్లాడుతూ.. మహేష్ మూవీ స్టోరీ ని పక్కాగా సిద్ధం చేసేందుకు, ప్రీ ప్రొడక్షన్ కోసం సుమారు ఓ ఏడు నెలలు పడుతుంది. అందుకే ఈఏడాది చివరి నుండి మహేష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నాం అంటూ చెప్పడంతో మహేష్ ఫాన్స్ ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. ఇక ఈలోపు మహేష్ సర్కారు వారి పాటని రిలీజ్ చేసి త్రివిక్రమ్ తో మూవీ కూడా కంప్లీట్ చెయ్యొచ్చని అంటున్నారు.