బిగ్ బాస్ నాన్ స్టాప్ రచ్చ మాములుగా లేదు. బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన వారు చాలెంజర్స్, వారియర్స్ గా విడిపోయి గ్రూపులు కట్టారు. అలాగే వారం వారం అనూహ్యమైన ఎలిమినేషన్స్ తో నాన్ స్టాప్ బిగ్ బాస్ రసవత్తరంగానే కనిపిస్తుంది. ఇక మొదటి వారం ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ మళ్ళీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ లో ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ లో కోర్టు సీన్ జరిగింది. అందులో చాలామంది హౌస్ మేట్స్ అఖిల్ కి మద్దతుగా బిందు మాధవికి వ్యతిరేఖం గా మట్లాడడంతో బిందు మాధవి హార్ట్ అయ్యి మైక్ విసిరేసి రచ్చ చేసింది. ఈ టాస్క్ లో చాలామంది బాగా పెరఫార్మెన్స్ ఇవ్వడంతో మీలో మీరే కెప్టెన్ అయ్యేందుకు తేల్చుకోండి అని బిగ్ బాస్ చెప్పాడు.
అందులో అఖిల్ టీమ్ లోని అజయ్, అషురెడ్డి, స్రవంతి నలుగురు కూడా కెప్టెన్ అవ్వడానికి పోటీపడ్డారు. రీ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ కు కూడా అవకాశం వచ్చింది. ఇక అందరిని దాటుకుని యాంకర్ శివ - అఖిల్ మధ్యలో గట్టి పోటీ నెలకొంది. ఎత్తర జెండా అంటూ ఫైనల్ టాస్క్ లో మొదటి నుంచి కూడా అఖిల్ డామినేషన్ కనిపించింది. అయినప్పటికీ ఓ గ్రూప్ లా ఫామ్ అయ్యి శివని ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. ముమైత్ ఖాన్, అజయ్, ఆశు లు అయితే యాంకర్ శివ మీద మీదకి వచ్చి గేమ్ ఆడినట్లుగా కనిపించింది. ఒంటరిగా పోరాడిన శివని జెండా పట్టకుండా చేసారు. ఇక అఖిల్ తన గ్రూప్ లోని వారినే సైడ్ చేసుకుంటూ రావడం, ఫైనల్ గా అఖిల్ - అజయ్ మధ్యన టాస్క్ పడినా అజయ్ కావాలనే అఖిల్ కి ఛాన్స్ ఇచ్చి కెప్టెన్ అయ్యేలా చేసాడు. అయితే అఖిల్ తో పోటీ పడిన యాంకర్ శివ కి బయట మద్దతు లభిస్తుంది. అఖిల్ గ్రూప్ రాజకీయాలు కన్నా యాంకర్ శివ పోరాటానికి అందరూ మద్దతు ఇస్తున్నారు.