Advertisementt

రశ్మికకి షాక్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ

Fri 01st Apr 2022 10:42 AM
kriti sanon,thalapathy 66,vijay,vamshi paidipally,dil raju,rahsmika  రశ్మికకి షాక్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ
Kriti Sanon to romance Vijay రశ్మికకి షాక్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ
Advertisement
Ads by CJ

లక్కీ బ్యూటీగా స్టార్ హీరోల సరసన వరస సక్సెస్ లతో పరుగులు పెడుతున్న రశ్మికకి శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ బ్రేకులు వేసింది. ఆ సినిమాలో రష్మిక లుక్స్, రష్మిక పెరఫార్మెన్స్ బావున్నా.. కథలోని లోపాలు ఆ సినిమాని డిజాస్టర్ చేసాయి. అయితే పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ ఉన్న రష్మిక అటు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్స్ తో బాలీవుడ్ హీరోయిన్స్ కె షాకిస్తుంది. అలాంటి రష్మికకి ఇప్పుడో బాలీవుడ్ బ్యూటీ షాకిచ్చింది.

వంశి పైడిపల్లి - కోలీవుడ్ హీరో విజయ్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఆ సినిమాలో రశ్మికనే హీరోయిన్ గా ఫిక్స్ అంటూ వార్తలొచ్చాయి. ఆల్మోస్ట్ రష్మిక ఫైనల్ అన్నారు. అబ్బో లక్కీ బ్యూటీ రశ్మికకి మరో పాన్ ఇండియా ఛాన్స్ తగిలింది అన్నారు. కానీ ఇప్పుడు కారణాలు క్లారిటీ లేదు కానీ రష్మిక ప్లేస్ లోకి బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. కృతి సనన్ ప్రస్తుతం ఆదిపురుష్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రభాస్ కి జోడిగా నటిస్తుంది. ఇక సౌత్ కి కృతి సనన్ పరిచయమే అయినా.. ఆమెకి టాలీవుడ్ లో చేసిన సినిమాలు ఏవి హిట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి కృతి సనన్ సౌత్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది.

Kriti Sanon to romance Vijay:

Kriti Sanon to play the female lead in Thalapathy 66?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ