Advertisementt

జబర్దస్త్ లో రోజా మిస్సింగ్

Thu 31st Mar 2022 08:05 PM
jabardasth,jabardasth comedy show,mla roja,minister roja,amani,mano,indraja  జబర్దస్త్ లో రోజా మిస్సింగ్
Roja missing in Jabardasth జబర్దస్త్ లో రోజా మిస్సింగ్
Advertisement
Ads by CJ

గత కొన్ని వారాలుగా రోజా జబర్దస్త్ ని ఒంటి చేత్తో నడిపిస్తుంది. జబర్దస్త్ లో కమెడియన్స్ కరువవడంతో.. రోజానే స్పెషల్ స్కిట్స్ చేస్తూ కామెడీ చేస్తుంది. అలాగే రీసెంట్ గా జబర్దస్త్ లో రోజా తో పాటుగా చాలామంది జేడ్జ్ లు మారుతున్నారు. మనో కొన్ని వారాలు మిస్ అయితే ఆ ప్లేస్ లోకి ఆమని వచ్చింది. తర్వాత లైలా వచ్చింది. ఇప్పుడు మనో వచ్చేసాడు. కానీ రోజా కనిపించడం లేదు. అసలే ఏపీ మంత్రి వర్గ విస్తరణలో రోజా కి మంత్రి పదవి ఖాయమనే మాట వినిపిస్తుంది. రోజా మంత్రి అయ్యాక కూడా లక్కీ షో జబర్దస్ లో కొనసాగుతుందో లేదో అనే డౌట్ అందరిలో ఉంది. 

మంత్రి గా బాధ్యతలు పెరుగుతాయి. అప్పుడు ఈ కామెడీ షో చేస్తే అందరూ రోజాని ట్రోల్ చెయ్యడం, టార్గెట్ చెయ్యడం ఖాయం. జేడ్జ్ గా హుందాగా వ్యవహరిస్తే ఓకె.. కానీ రోజా ఇంకాస్త దిగిపోయి కామెడీ స్కిట్స్ లో వేలు పెడుతుంది. అందులో రోజా డైలాగ్స్ బాగానే పేలుతున్నా.. ఆమెకి కామెడీ అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ రోజు రాబోతున్న జబర్దస్త్ లో మనో పక్కన జేడ్జ్ గా ఆమనీ కూడా కనిపించలేదు. ఆ ప్లేస్ లో ఇంద్రజ వచ్చింది. గతంలో రోజా లేనప్పుడు ఇంద్రజానే మనో పక్కన స్పెషల్ జేడ్జ్ గా వచ్చింది. కొన్ని వారాలుగా జబర్దస్త్ కి పర్మినెంట్ జెడ్జెస్ కనిపించడం లేదు. స్పెషల్ జేడ్జ్ ల తాకిడి ఎక్కువైంది. మరి రోజా ఇప్పుడు మిస్ ఆయినా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో అని ఆమె అభిమానులు వెయిట్ చేస్తున్నారు. 

Roja missing in Jabardasth:

Jabardasth comedy show update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ