Advertisementt

కెజిఎఫ్ 2 లో అదే ప్రత్యేకం

Thu 31st Mar 2022 06:55 PM
kgf 2,kgf,yash,prashanth neel,yash kgf,kgf2 trailer,kgf 2 update  కెజిఎఫ్ 2 లో అదే ప్రత్యేకం
Interesting update on KGF 2 కెజిఎఫ్ 2 లో అదే ప్రత్యేకం
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ప్రపంచం అంతా టాలీవుడ్ వైపు చూస్తుంటే మరో 14 రోజుల్లో అందరి డైవెర్షన్ కన్నడ పరిశ్రమ వైపుకి మారబోతుంది. టాలీవుడ్ నుండి పాన్ ఇండియా ఫిలిం ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవడం బ్లాక్ బస్టర్ అవడం జరిగింది. ఇక మీదట అందరూ కన్నడ ఇండస్ట్రీ నుండి రాబోతున్న కెజిఎఫ్ 2 కోసం కాచుకుని కూర్చున్నారు. యశ్ - ప్రశాంత్ నీల్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో.. ఎలాంటి రికార్డులు నెలకొల్పుతారో అని. ఏప్రిల్ 14 న రిలీజ్ కాబోతున్న కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ ని యశ్ అండ్ టీం మొదలు పెట్టేసారు. ప్రవేట్ ఫ్లైట్ లో యశ్ అండ్ బ్యాచ్ కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ కి బయలుదేరారు. 

అయితే తాజాగా కెజిఎఫ్ 2 కి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీ చెయ్యగా.. ఆ సినిమాపై ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అది కెజిఎఫ్ 2 ట్రైలర్ లో యశ్ చెప్పిన హీరోటిక్ డైలాగ్స్ కి అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో యశ్ పవర్ ఫుల్ రాఖి భాయ్ పాత్రలో కనిపించడమే కాకుండా.. తనలోని రైటింగ్ స్కిల్స్ ని కూడా బయటికి తీసాడట. యశ్ కేరెక్టర్ కి సంబందించిన పవర్ ఫుల్ డైలాగ్స్ ని యశ్ స్వయంగా రాసుకున్నాడట. ఈ విషయాన్ని కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కెజిఎఫ్ 2 ట్రైలర్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ బావున్నాయని చాలామంది చెప్పారని, అయితే ఆ డైలాగ్స్ చాలా వరకు యశ్ రాసుకున్నాడంటూ ఆయన రివీల్ చేసారు. సో యశ్ హీరోనే కాదు రైటర్ గా కూడా సత్తా చాటుతున్నాడన్నమాట.

Interesting update on KGF 2:

Powerful update on KGF 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ