పుష్ప సినిమా విడుదలైన అన్ని భాషల్లో విజయ ఢంకా మోగించింది. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ఇప్పటికి ఆడియన్స్ మదిలో మెదులుతున్నాడు. ఎక్కడ చూసినా తగ్గేదే లే అంటూ అందరూ పుష్ప ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. దానితో ఇప్పుడు రాబోయే పుష్ప2, పుష్ప ద రూల్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నెలలోనే పుష్ప 2 షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. మరో రెండు నెలల వరకు పుష్ప షూటింగ్ మొదలు కాకపోవచ్చని అంటున్నారు. దానితో పుష్ప 2 ఈ ఏడాది కాకుండా 2023 లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇక అల్లు అర్జున్ ఇంకా పుష్ప లుక్ అంటే లాంగ్ హెయిర్ లోనే కంటిన్యూ అవుతున్నారు.
అయితే తాజాగా పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఇటు సుకుమార్ పారితోషకాలను భారీగా పెంచేశారని టాక్ వినిపిస్తుంది. మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 హిందీలో 100 కోట్లు కొల్లగొట్టడం, మిగతా భాషల్లోనూ పుష్ప సినిమాకి ఉన్న హైప్ కారణంగా హీరో, దర్శకులు తమ పారితోషకాలను పెంచేశారనే న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. పార్ట్ వన్ కి తీసుకున్న పారితోషకానికి మరింతగా యాడ్ చెయ్యమని, లేదంటే హిందీ రైట్స్ తనకిమ్మని అల్లు అర్జున్ నిర్మాతల దగ్గర ప్రపోజల్ పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి మైత్రి మూవీ మేకర్స్ వారు ఇటు పార్ట్ 2 బడ్జెట్ కూడా పెంచాల్సి వస్తుందట. అటు ప్రమోషన్స్ కోసమూ ఈసారి స్పెషల్ బడ్జెట్ కేటాయించబోతున్నారట.