ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుగు సినీ పరిశ్రమ వంకే చూస్తుంది. పాన్ ఇండియా మూవీస్ తో తెలుగు స్టార్ హీరోలు సత్తా చాటుతున్నారు. హాలివూడ్ మూవీస్ తో పోటీ పడుతూ బాలీవుడ్ ని కూడా వెనక్కి నెట్టేసింది టాలీవుడ్. బాహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప మూవీస్ తో టాలీవుడ్ ప్రత్యేకత అందరికి అర్ధమైంది. తెలుగు పరిశ్రమపై పొగడ్తలను బాలీవుడ్ అంత తేలిగ్గా తీసుకోలేకపోతుంది. ఇండియాలోనే అతి పెద్ద మార్కెట్ హిందీ మార్కెట్. ఇప్పుడు హిందీ మార్కెట్ ని తెలుగు సినిమా చీల్చి చెండాడుతుంది. దానితో బాలీవుడ్ ప్రముఖుల మనసులో అగ్ని పర్వతం బద్దలయ్యింది.
పైకి ట్రిపుల్ ఆర్ ని పొగుడుతూనే లోలోపల అక్కసు వెళ్లగక్కుతున్నారు. రాధే శ్యామ్ డిజాస్టర్ తో కూల్ అయిన హిందీ హీరోలు, ట్రిపుల్ ఆర్ హిట్ తో కుతకుత ఉడికిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం అయితే టాలీవుడ్ పై తన అక్కసు వెళ్లగక్కాడు. ఏప్రిల్ 1 న అటాక్ మూవీ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న జాన్ అబ్రహం ని ఓ మీడియా మిత్రుడు మీరు టాలీవుడ్ లో నటిస్తారనే న్యూస్ విన్నాం నిజమేనా అని అడగగా దానికి జాన్ అబ్రహం కాస్త గట్టిగానే స్పందించాడు. నేను ఎలాంటి తెలుగు సినిమాల్లో నట్టించడం లేదు. నేను ఎప్పటికి ఇతర భాషల్లో సినిమాలు చెయ్యను. నేను హిందీ హీరోని, కేవలం హిందీలో మాత్రమే నటిస్తాను, వేరే భాషల్లో సెకండ్ హీరోగానో లేదంటే విలన్ గానో నటించను. వేరే హీరోల్లా డబ్బు కోసం నేను వేరే భాషల మూవీస్ లో నటించను అంటూ కాస్త ఓవరాక్షన్ చేసాడు.
అంటే వేరే భాషా హీరోలు డబ్బు కోసమే ఇతర భాషల సినిమాలు చేస్తున్నారనా ఆ హీరో ఉద్దేశ్యం. పాన్ ఇండియా మూవీస్ జోరు చూడలేక జాన్ అలా మాట్లాడాడా.. అంటూ మూవీ లవర్స్, నెటిజెన్స్ జాన్ అబ్రహం పై ఫైర్ అవుతున్నారు.