బిగ్ బాస్ కి వెళ్ళాక దానిలో తమ జర్నీ ముగిసాక ఓ ఏడాది పాటు వేరే ఛానల్ కి వెళ్ళకూడదు అనే కండిషన్ మీదే స్టార్ మా కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ లోకి తీసుకుంటుంది. కేవలం స్టార్ మా ఛానల్ లోనే ఓ ఏడాది ఉండిపోవాలి. అలా గత సీజన్స్ అప్పుడు కంటెస్టెంట్స్ అలానే ఓ ఏడాది తర్వాతే ఇతర ఛానల్స్ లోకి వెళ్లారు. అయితే బిగ్ బాస్ ఛాన్స్ రాకముందు కొన్ని ఛానల్స్ లో సీరియల్స్ లో కనిపించిన అలీ రెజా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చాక హౌస్ నుండి బయటికి వచ్చాక మళ్ళీ ఇంతవరకు ఏ టివి ఛానల్ లోను కనిపించలేదు. సినిమాల్లో తప్ప. రీసెంట్ గా ఓ షో లో పాల్గొన్న అలీ రెజా ని మీరు బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక తర్వాత ఎవరికీ కనిపించలేదు ఏమిటి అని అడిగారు.
దానికి అలీ రెజా షాకింగ్ కామెంట్స్ చేసాడు. అప్పట్లో బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. సరే క్రేజ్ వస్తుంది, మంచి పారితోషకం వస్తుంది కదా అని బిగ్ బాస్ లోకి వెళ్ళాను. అక్కడ ఓసారి ఎలిమినేట్ అయ్యాక మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత బయటికి వచ్చాక ఓ చిన్న మిస్టేక్ చేశాను. అప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్లేసరికి అలీ రెజా రెండేళ్లు బ్యాన్ అన్నారు.. ఆ మాట వినగానే హార్ట్ ఎటాక్ వచ్చినంత పనయ్యింది అంటూ అలీ రెజా చెప్పిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎందుకు బ్యాన్ చేసారో అది ఆ షోలో అలీ రెజా చెప్తాడేమో చూడాలి.