రాఖి సినిమా టైం లో యంగ్ టైగర్ విపరీతమైన బరువు తో స్క్రీన్ మీద కదలడానికి ఇబ్బంది పడ్డాడు. బరువు తగ్గాలని ఎన్టీఆర్ చేసిన వర్కౌట్స్ అతన్ని బరువు తగ్గించలేదు. కానీ రాజమౌళి చెప్పినప్పుడు ఎన్టీఆర్ ఆలోచనలో పడి అప్పుడు విపరీతంగా బరువు తగ్గి సన్నగా తయారయ్యాడు. అప్పటి నుండి బరువుని కంట్రోల్ లోనే ఉంచుతున్న ఎన్టీఆర్ ట్రిపుల్ లోని కొన్ని సీన్స్ కోసం బరువు పెరగడం, మళ్ళి తగ్గడం చేసాడు. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లోను ఎన్టీఆర్ స్లిమ్ గానే కనిపించినా మోహంలో మాత్రం బుగ్గలు కాస్త ఉబ్బినట్టుగా, కాస్త బరువు పెరిగాడేమో అని అనిపించింది. అయితే ఇప్పుడు కొరటాలతో ఎన్టీఆర్ చెయ్యబోయే సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గబోతున్నాడట.
కొరటాలతో ఎన్టీఆర్ చెయ్యబోయే పాన్ ఇండియా ఫిలిం లో కాస్త స్లిమ్ లుక్ లో కనిపించాలని, ఎన్టీఆర్ దాని కోసం ఏకంగా 8 కిలోల బరువు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నాడట. ఆ సినిమా మొదలయ్యే సమయానికి ఎన్టీఆర్ పూర్తిగా వెయిట్ కంట్రోల్ లోకి వస్తాడని, పూర్తి ఫిట్ గా బాడీ ని షేప్ చెయ్యాలని చూస్తున్నాడట. ట్రిపుల్ టెంక్షన్ నుండి రివీల్ అయిన ఎన్టీఆర్ కొద్దిగా ఫ్రెష్ అవ్వాలని ఫారిన్ ట్రిప్ వెయ్యడబోతున్నాడట. ఫారిన్ ట్రిప్ పూర్తి కాగానే ఎన్టీఆర్ జిమ్ లోకి చేరిపోయి బరువు కంట్రోల్ చేసేస్తాడని తెలుస్తుంది.