జులై 1 టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మంచి ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోతుంది. ఎందుకంటే మెగా హీరో vs గోపీచంద్ జులై 1న తలపడబోతున్నారు. మెగా హీరో వైష్ణవ తేజ్ రంగ రంగ వైభవంగా మూవీని జులై 1న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించిన కొద్ది సేపటికే గోపీచంద్ - మారుతీ కాంబోలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ కూడా జులై 1నే విడుదల అంటూ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు. ఉప్పెన సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ తేజ్ - కేతిక శర్మ కలయికలో గిరిసయ్య దర్శకత్వంలో తెరకెక్కిన రంగ రంగ వైభవంగా మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉండబోతుంది.
ఇక మారుతీ గోపీచంద్ కలయికలో కామెడీ ఎంటర్టైనర్ గా పక్కా కమర్షియల్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రాశి ఖన్నా తో గోపీచంద్ రొమాన్స్ చేస్తున్నాడు. ఈ మధ్యే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జిక్రు రాసిన టైటిల్ సాంగ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.