యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నీరు - నిప్పులా చెలరేగిపోయిన ట్రిపుల్ ఆర్ అన్ని భాషల్లో కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ సినిమా హిట్ అవడంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఫాన్స్ కి ట్రిపుల్ ఆర్ టీం కి ఎమోషనల్ గా లెటర్స్ వ్రాసారు. ఎన్టీఆర్ అమాయకత్వపు నటనతో స్క్రీన్ ని చీల్చి చెండాడగా.. రామ్ చరణ్ అల్లూరిగా అద్భుతః అనిపించాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ పెరఫార్మెన్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు. అయితే ఎన్టీఆర్ రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరో ఎంట్రీ సీన్స్ వచ్చినప్పుడు క్లాప్స్ కొడుతూ గోల చేస్తూ సినిమాలో ఆడియన్స్ నిమగ్నమైపోతారని, కానీ ట్రిపుల్ లో భీమ్ ఇంట్రో సీన్స్ చూస్తే కేరెక్టర్ పై పూర్తి అవగాహన వచ్చేలా రాజమౌళి ఆ సీన్స్ తెరకెక్కించారని చెప్పారు.
డైరెక్టర్స్ పాయింట్ అఫ్ వ్యూ లో ఇదొక గొప్ప ఇంట్రడక్షన్ సీన్ అని, ఆ ఇంట్రో సీన్స్ ని ఫాన్స్ ఫోన్స్ లో రికార్డ్ చేసి యూట్యూబ్ లో వైరల్ చేస్తుండడం హ్యాపీగా ఉంది అన్న ఎన్టీఆర్ సినిమా కలెక్షన్స్ పై కామెంట్స్ చేసారు. ట్రిపుల్ ఆర్ మూవీ కి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి కదా దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని అడగగా.. నా దృష్టిలో మొదట ప్రశంశలు, ఆ తర్వాత రివ్యూ, ఆ తర్వాతే కలెక్షన్స్. ఆ నెంబర్స్ తో నాకు పని లేదు. కానీ ఆ నెంబర్స్ పెరిగితే కథానాయకుడిగా మరింత ఆత్మవిశ్వాసం మాత్రం పెరుగుతుంది అంటూ ఎన్టీఆర్ సినిమా కలెక్షన్స్ పై కామెంట్స్ చేసారు.