Advertisementt

బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది

Wed 30th Mar 2022 04:30 PM
mumaith khan,bigg boss ott,bigg boss telugu,bigg boss non stop,akhil,bindu madhavi  బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది
She made a re-entry into Bigg Boss బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ వన్ లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఉన్నప్ప్పుడు ప్రస్తుతం ఫెడవుట్ అయిన ముమైత్ ఖాన్ హౌస్ లోకి వచ్చింది. అప్పుడే డ్రగ్స్ కేసు విచారణ కూడా ఉండడంతో మధ్య లో ఓసారి ఈడి విచారణకు కూడా హాజరైంది. ఆ సీజన్ లో ముమైత్ ఖాన్ మధ్యలోనే ఎలిమినేట్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి మళ్ళి ఛాన్స్ రావడంతో హ్యాపీ గా ఎంట్రీ ఇచ్చింది ముమైత్ ఖాన్. హౌస్ లో సిగరెట్స్ కాలుస్తూ మధ్యలో హెల్త్ ఇష్యు రావడంతో ఆ వారమంతా కాస్త సైలెంట్ గానే కనబడింది. చాలామంది ముమైత్ ఖాన్ ని నువ్వు సిగరెట్లు కాల్చడం తప్ప ఏం చేయవని హేళన చేసారు. అనూహ్యంగా ముమైత్ ఖాన్ మొదటి వారమే ఎలిమినేట్ అయ్యింది. దానితో ఆమె షాకయ్యింది.

అయితే ముమైత్ కి బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చారు. అది బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి రే ఎంట్రీ ఇచ్చే ఛాన్స్. దానితో ముమైత్ మరోసారి హౌస్ లోకి వెళ్లిన ప్రోమో వదిలింది నాన్ స్టాప్ బిగ్ బాస్ యాజామాన్యం. ఇక అక్కడ హౌస్ లో అఖిల్ - బిందు మాధవిలు విడాకుల కేసు కోర్టులో ఉన్న టాస్క్ నడుస్తుంది. ఆ టాస్క్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ని చూడగానే హౌస్ మేట్స్ అంతా సర్ ప్రైజ్ అయ్యారు. ఇక అఖిల్- బిందు మాధవి కేసు కి తీర్పు ఇవ్వడానికి ఏకంగా జేడ్జ్ ప్లేస్ లో కూర్చున్న ముమైత్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

She made a re-entry into Bigg Boss:

Mumaith Khan to make re-entry into Bigg Boss OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ