ఎటువంటి అంచనాలు లేకుండా, ఓ సినిమా కన్నడ నుండి వస్తుంది అనే క్రేజ్ లేకుండా ఇండియన్ బాక్సాఫీసు మీద దాడి చేసింది కెజిఎఫ్ మూవీ. యశ్ - ప్రశాంత్ నీల్ లు ఎవరో అనేది అప్పుడే తెలిసింది ప్రపంచానికి. అప్పటివరకు కన్నడ ఇండస్ట్రీ వైపు చూడనివారంతా కన్నడ వైపు చూసేలా చేసింది కెజిఎఫ్. యశ్ ని అంతగా ఆ సినిమా స్టార్ రేంజ్ కి తీసుకువెళ్ళింది. ప్రశాంత్ నీల్ ని ఒకే ఒక్క సినిమా ఓ రేంజ్ లో కూర్చోబెట్టింది. కెజిఎఫ్ మూవీ లో యశ్ మాస్ గా, చిన్న రౌడీ స్థాయి నుండి కెజిఎఫ్ కి ఎలా హీరోగా ఎదిగాడో.. అనేది పార్ట్ వన్ లో చూపెట్టారు.
మళ్లీ కెజిఎఫ్ పీఠాన్ని ఎలా కాపాడుకున్నాడో, దాని కోసం శత్రు మూఖని ఎలా ఎదుర్కుకున్నాడో అనేది ఇప్పుడు చాప్టర్ 2 లో చూపించబోతున్నారు. అయితే అంచనాలు లేకుండా కలెక్షన్స్ కొల్లగొట్టిన కెజిఎఫ్ ఇప్పుడు ఆ హవా ని, క్రేజ్ ని ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగిస్తుందా.. భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రాబోతున్న కెజిఎఫ్ 2 కెజిఎఫ్ అంత హిట్ అందుకుంటుందా? ఎందుకంటే కెజిఎఫ్ 2 ట్రైలర్ చూస్తే మాస్ ని మరో లెవల్లో ప్రెజెంట్ చేసినట్లుగా, అలాగే విలన్స్ ని నరుక్కుంటూ పోయినట్లుగా చూపించారు తప్ప అందులో కథ ఏం కనిపించడం లేదు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఏం లేవు. అప్పుడు కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ అయిన రేంజ్ లో ఇప్పుడు కెజిఎఫ్ 2 హిట్ కొడుతుందా అనేది అందరిలో ఉన్న డౌట్. ప్రశాంత్ నీల్ మళ్ళీ ఏం మ్యాజిక్ చేస్తారో అనే క్యూరియాసిటీతో మాస్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 14 న కానీ ఆ సస్పెన్స్ కి తెర పడదు.