ఈ రోజు నితిన్ పుట్టిన రోజు. గత ఏడాది వరస సినిమాలతో ఆడియన్స్ ని అలరించిన నితిన్ ఈ ఏడాది మాచర్ల నియోజక వర్గంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ మాస్ మరియు యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా మొదటి బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ రెడ్డి అనే IAS అధికారి పాత్రను నితిన్ పోషిస్తున్నాడు. నితిన్ బర్త్ డే స్పెషల్ గా మాచర్ల నియోజక వర్గం నుండి ఫస్ట్ ఎటాక్ అంటూ టీజర్ ని రిలీజ్ చేసింది టీం.
ఈ టీజర్ లో నితిన్ మాస్ అవతార్ లో శత్రువులని వేటాడే పులిలా కనిపిస్తున్నాడు. నితిన్ మాస్ లుక్స్, నితిన్ యాక్షన్, నితిన్ పవర్ ఫుల్ లుక్ అలాగే మహతి స్వర సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అన్ని మాచర్ల నియోజక వర్గం టీజర్ లో హైలెట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలో నితిన్ లక్కీ బ్యూటీ కృతి శెట్టి తో రొమాన్స్ చేస్తున్నాడు. నితిన్ బర్త్ డే కి పర్ఫెక్ట్ ట్రీట్ గా ఈ టీజర్ నిలిచింది. అయితే నితిన్ పుట్టిన రోజు స్పెషల్ గా టీజర్ తో పాటు ఈ సినిమా జులై 8 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్లుగా రిలీజ్ డేట్ ని కూడా గ్రాండ్ గా ప్రకటించారు మేకర్స్.