కరోనా మహమ్మారి దెబ్బకి ఎంటైర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కుదేలైన సంగతి తెలిసిందే. దాని నుండి కోలుకోవడానికి ప్రతి భాషా చిత్ర పరిశ్రమ ఇంకా పోరాడుతూనే ఉంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రం గ్యాప్ దొరికిన ప్రతిసారి సాలిడ్ హిట్స్ తో సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక ఊపుని తీసుకు వస్తుంది. కరోనా ఫస్ట్ వేవ్ తో తొమ్మిది నెలల గ్యాప్ వచ్చినప్పుడు క్రాక్, ఉప్పెన, జరత్నాలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ తో సినిమా ఇండస్ట్రీని ఊపేసాయి. అలాంటి సాలిడ్ హిట్స్ ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీనే.
ఈవెన్ కరోనా సెకండ్ వేవ్ నుండి మళ్లీ చిత్ర పరిశ్రమని ట్రాక్ లోకి తీసుకు వచ్చింది కూడా తెలుగు సినిమా పరిశ్రమనే. లవ్ స్టోరీ లాంటి చిన్న సినిమా దగ్గరనుండి అఖండ లాంటి భారీ బడ్జెట్ సినిమా, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ లాంటి పాన్ ఇండియా మూవీస్ తో సాలిడ్ హిట్స్ అందుకుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. కరోనా థర్డ్ వేవ్ అంటూ ఓ నెల గ్యాప్ తీసుకున్న చిత్ర పరిశ్రమ మళ్లీ భీమ్లా నాయక్, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ చూపిస్తున్నాయి. ప్రేక్షకులను థియేటర్స్ దగ్గరకి లాక్కొచ్చాయి. మళ్ళీ సినిమాని మన జీవితంలో భాగం చేసేశాయి.
మిగతా భాషల్లో కన్నడ, హిందీ ని చూసుకుంటే.. కన్నడలో జేమ్స్, హిందీలో కాశ్మీరీ ఫైల్స్ కాస్త పర్లేదు అనిపించుకున్నాయి కానీ.. ఇక మిగతా ఏ భాషలోనూ తెలుగు సినిమాకి వచ్చిన సాలిడ్ హిట్స్ కనిపించలేదు, వినిపించలేదు. కానీ తెలుగు సినిమా మాత్రం కరోనా వేవ్స్ ని తట్టుకున్న ప్రతిసారి పై చెయ్యి సాధించింది.