Advertisementt

రాజమౌళికి మహేష్ కి సెట్టవ్వుద్దా

Tue 29th Mar 2022 11:37 AM
ss rajamouli,mahesh babu,rrr movie,ntr,am charan,ss rajamouli - mahesh babu  రాజమౌళికి మహేష్ కి సెట్టవ్వుద్దా
SS Rajamouli confirms film with Mahesh Babu రాజమౌళికి మహేష్ కి సెట్టవ్వుద్దా
Advertisement
Ads by CJ

రాజమౌళి అంటే పని రాక్షసుడు. ఆయనతో వర్క్ చేసే హీరోలెవరైనా ఆయన చెప్పిందే వినాలి. అంటే కమాండింగ్ అని కాదు కానీ.. పని విషయంలో రాజమౌళి పర్ఫెక్ట్ గా ఉంటారు. అంతేకాకుండా అయన సినిమా చేసాక పర్ఫెక్షన్ వచ్చేవరకు చెక్కుతూ ఉండే దర్శకుడు. అది ఎన్నేళ్లయినా లెక్క చెయ్యరు. ఒన్స్ హీరో ఒకసారి రాజమౌళి సినిమాలోకి ఎంటర్ అయ్యారంటే రెండేళ్లు పట్టొచ్చు, లేదంటే నాలుగేళ్లయినా ఆశ్చర్య పోవక్కర్లేదు. అర్ధరాత్రి అయినా, పొద్దు పొద్దున్నే అయినా.. ఆయన పిలిస్తే సెట్స్ లో వాలిపోవాలి. హెల్త్ అప్ సెట్ అయినా, మారేదన్నా కారణమైనా రాజమౌళి రమ్మంటే వెళ్లాల్సిందే.

మరి ఇదంతా మహేష్ చెయ్యగలరా.. అంటే కూల్ గా ఏ టెంక్షన్ పడకుండా సినిమాలు చేసే హీరో ఆయన. సాయంత్రం 6 గంటల వరకు షూటింగ్ చేసి ఇంటికి వెళ్లే మహేష్ దర్శకుడు పిలిస్తే వెళతారు కానీ, అప్పుడు అలసిపోయి ఉంటాము, ఆ టైం లో మనం ఫ్రెష్ గా షూటింగ్ చేయలేము అనేది మహేష్ అభిప్రాయం. అలాగే మహేష్ చాలా అందగాడు. అలాంటి మహేష్ ని రాజమౌళి ఎలా ప్రెజెంట్ చేస్తారు. మహేష్ అందమైన రూపాన్ని ఎలా మారుస్తారు. అసలు మహేష్ రాజమౌళి కి మ్యాచ్ అవుతారా? ఇలా మహేష్ ఫాన్స్ లోనే కాదు ఇతర ప్రేక్షకుల్లోనూ బోలెడన్ని అనుమానాలున్నాయి. మహేష్ తో రాజమౌళి జేమ్స్ బాండ్ మూవీ చేయబోతున్నారని అది కూడా 800 కోట్ల బడ్జెట్ తో అంటూ ప్రచారం షురూ అయ్యింది.

SS Rajamouli confirms film with Mahesh Babu:

SS Rajamouli to collaborate with Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ