Advertisementt

పవర్ ఫుల్ లాయర్ గా విశ్వక్ సేన్

Tue 29th Mar 2022 10:23 AM
mukhachitram,mass ka das,vishwak sen birthday,vishwak sen,vishwamithra  పవర్ ఫుల్ లాయర్ గా విశ్వక్ సేన్
Vishwak Sen in a special role as Vishwamithra పవర్ ఫుల్ లాయర్ గా విశ్వక్ సేన్
Advertisement
Ads by CJ

యంగ్ హీరో విశ్వక్ సేన్ వరస ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. గంగాధర్ డెబ్యూ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ముఖచిత్రంలో ఓ స్పెషల్ కేరెక్టర్ లో నటిస్తున్నారు.

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిఫరెంట్ కథాంశంతో రూపొందుతుంది. ఈ రోజు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. లాయర్ విశ్వామిత్ర పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు. ఈ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటూ కథలో కీలకంగా వ్యవహరిస్తుంది.. అని తెలుస్తుంది. 15 నుంచి 20 నిమిషాలు సినిమాలో ఉండే లాయర్ విశ్వామిత్ర క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించారు. 

విశ్వక్ సేన్ కు ముఖచిత్రం టీమ్ పుట్టినరోజు విశెస్ తెలిపింది. ఇప్పటిదాకా సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్ లుక్స్ ఈ మూవీని ఇంటెన్స్ లవ్ స్టోరీ గా ప్రెజెంట్ చేయగా.. ఇప్పుడు విశ్వక్ సేన్ పోస్టర్ రివీల్ తో ఇదొక ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెలుస్తున్నది. మూవీ టీమ్ లో విశ్వక్ సేన్ యాడ్ అవడంతో ముఖచిత్రం సినిమా మీద మరింత క్రేజ్ పెరిగింది. 

Vishwak Sen in a special role as Vishwamithra:

Mukhachitram wishes Mass Ka Das a very happy birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ