ఈ రోజు ఉదయం నుండి రాజమౌళిపై బాలీవుడ్ భామ ట్రిపుల్ ఆర్ సీత అలియా భట్ కి కోపం వచ్చింది.. అందుకే రాజమౌళి ని తన ఇన్స్టా లో అన్ ఫాలో చేసింది అంటూ, అలాగే ట్రిపుల్ ఆర్ పోస్టర్స్ ని ఫొటోస్ ని తన అకౌంట్ నుండి డిలేట్ చేసింది అంటూ రకరకాల న్యూస్ లు వెబ్ సైట్స్ లోను, సోషల్ మీడియాలోనూ స్ప్రెడ్ అయ్యింది. ట్రిపుల్ ఆర్ మూవీలో అలియా భట్ రోల్ హీరోయిన్ కి తక్కువ గెస్ట్ రోల్ కి ఎక్కువ అని, అలియా భట్ కేరెక్టర్ ఎంతో ఊహించుకుంటే.. అంతా రాజమౌళి తుస్ మనిపించారు అంటూ ఆర్ ఆర్ ఆర్ మూవీ చూసిన వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అటు అలియా భట్ 15 నిమిషాల నిడివి కేరెక్టర్ చెయ్యడానికి కోట్లు అడిగింది అన్నారు.
కాని ఆలియా భట్ రాజమౌళి సినిమాలో చిన్న కేరెక్టర్ వచ్చినా వదలను, అది నా అదృష్టం అలాంటి అవకాశం నాకు ట్రిపుల్ ఆర్ లో వచ్చింది అందుకే నేను ఆ సినిమా చేశాను అంది. కానీ కొంతమంది అయ్యయ్యో.. రాజమౌళి నమ్ముకున్న అలియా ని నట్టేట ముంచేసాడే అంటూ అలియా భట్ ఫాన్స్ ఫీలవడంతో హార్ట్ అయిన అలియా రాజమౌళిని అన్ ఫాలో చేసింది అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ అలియా భట్ తన ఇన్స్టా ఎకౌంట్ నుండి ట్రిపుల్ ఆర్ ఫొటోస్ ని అయితే తొలగించలేదు. ఆమె ఎకౌంట్ లో ట్రిపుల్ ఆర్ ఫొటోస్ నిక్షేపంగా కనబడుతున్నాయి. సో దీన్ని బట్టి రాజమౌళిపై అలియా భట్ కి ఎలాంటి కోపం లేదు.