పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాత ఇమ్మిడియట్ గా హరి హర వీరమల్లు షూటింగ్ లోకి జంప్ అవుతారనుకుంటే.. ఆయన అటు రాజకీయాలు ఇటు రష్యా ట్రిప్స్ లో బిజీగా మారిపోయారు. మధ్యలో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుని పక్కనబెట్టి మేనల్లుడు సాయి తేజ్ తో ఓ తమిళ హిట్ మూవీ ని రీమేక్ చేయబోతున్నారనే ప్రచారమూ జరిగింది. మార్చి ఫస్ట్ వీక్ లోనే హరి హర వీరమల్లు ఫ్రెష్ షెడ్యూల్ మొదలు పెట్టాల్సి ఉండగా.. అది కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది. అప్పటినుండి ఇప్పటి వరకు ఆ సినిమా అప్ డేట్ పై ఎలాంటి న్యూస్ లేదు. అయితే ఈ రోజు హరి హర వీరమల్లు నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది.
కొద్ది రోజుల్లో హరి హర వీరమల్లు సెట్స్ పైకి వెళ్లబోతుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 17 వ శతాబ్ద కాలాన్ని ప్రతిబింబించేలా అప్పటి గొప్ప నిర్మాణాలను సెట్టింగ్స్ రూపకల్పన చేస్తున్నారు. గోల్కొండ ఫోర్ట్, చార్మినార్ లాంటి సెట్స్ ఈ మూవీ కోసం వేశారు. ప్రస్తుతం హైదరాబాదులో సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి పర్యవేక్షణలో కొన్ని సెట్టింగ్స్ సిద్ధం చేయిస్తున్నారు. ఈ సెట్టింగ్స్ ఒకదాన్ని మించిపోయేలా మరొకటి ఉంటాయని టాక్ వినిపిస్తోంది. దానికి సంబందించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ చిత్రంలో ప్రాచీన భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు క్రిష్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ భామ నోరా ఫెతి ఓ కీ రోల్ ప్లే చేస్తున్నారు.