Advertisementt

రొమాంటిక్ కృష్ణ వ్రింద విహారి

Mon 28th Mar 2022 11:36 AM
anil ravipudi,naga shaurya,sherlyn,krishna vrinda vihari teaser,krishna vrinda vihari  రొమాంటిక్ కృష్ణ వ్రింద విహారి
Krishna Vrinda Vihari teaser released రొమాంటిక్ కృష్ణ వ్రింద విహారి
Advertisement
Ads by CJ

వరస ప్లాప్స్ తో సతమతమవుతున్న యంగ్ హీరో నాగ శౌర్య వరుడు కావలెను సినిమాతో డీసెంట్ హిట్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్స్ పరంగా ఆ సినిమా కూడా ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత లక్ష్య లక్ష్యాన్ని ఛేదించడంలో మిస్ అయ్యింది. ఆ తర్వాత అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగ శౌర్య, షెర్లీ సెటియా అనే కొత్త హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ కృష్ణం వ్రింద విహారి మూవీని ఓ బ్యానర్ ఐర క్రియేషన్స్ లో చేస్తున్నాడు. ఏప్రిల్ 22 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని టీజర్ తో మొదలు పెట్టింది టీం. అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేసారు.

టీజర్ లోకి వెళితే నాగ‌శౌర్య రొమాంటిక్ లుక్‌ లోనే కాదు.. చాలా క్లాసీ స్టైల్‌తో క‌నిపించాడు. హీరోయిన్ షెర్లీ సెటియా అయితే గ్లామర్ గా రొమాంటిక్ యాంగిల్ లో రెచ్చిపోయింది. గుండెల్లో గంట కొట్టుకోవ‌డం, ఆ అమ్మాయి వెనుక ప‌డ‌డం.. త‌న‌ని ఫ్ల‌ట్ చేయ‌డం వంటి రొమాంటిక్ సీన్స్ అన్ని ఈ టీజర్ కి హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక హీరోయిన్ షెర్లీ సెటియా నువ్వు వర్జిన్ వా అని నాగ శౌర్య మొహం మీదే అడిగే డైలాగ్, సత్య - రాహుల్ రామ కృష్ణ తో నాగ శౌర్య ఫన్నీ సీన్స్, అలాగే ఎమోషనల్ గా చెప్పాల్సిన సౌంద‌ర్య‌లా నీకేమైనా సెక్సువ‌ల్ ఎబ్యూజ్ జ‌రిగిందా? ఫ‌ర్లేదు నిన్ను వెంక‌టేష్ కన్నా బాగా చూసుకొంటా అంటూ ఫన్నీ గా చెప్పడం వంటి సన్నివేశాలు బావున్నాయి. ఇక మ్యూజిక్ కూడా కృష్ణ వృందా విహారి ఓ బలంలా కనిపిస్తుంది. మరి ఈ టీజర్ చూస్తే ఈసారి నాగ శౌర్య గట్టిగానే కొట్టేలా కనిపిస్తున్నాడు. 

Krishna Vrinda Vihari teaser released :

Anil Ravipudi launces Krishna Vrinda Vihari teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ