Advertisementt

మెగా ఫ్యామిలీ నుండి వస్తే హీరో అయిపోతారా!

Sat 09th Apr 2022 12:23 PM
ram charan,birthday,mega power star,rrr,ram charan hero,ss rajamouli,chirutha,ram charan movies,mega hero  మెగా ఫ్యామిలీ నుండి వస్తే హీరో అయిపోతారా!
Ram Charan gets One More Blockbuster with RRR Movie మెగా ఫ్యామిలీ నుండి వస్తే హీరో అయిపోతారా!
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ నుండి వస్తే హీరో అయిపోతారా అన్నది ఎవరినో కాదు,. మెగాస్టార్ తనయుడు, ప్రస్తుత స్టార్ హీరో రామ చరణ్‌ని. పూరి చేతుల మీదుగా రామ్ చరణ్ ‘చిరుత’ మూవీతో టాలీవుడ్‌కి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా రామ్ చరణ్‌కి పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. కానీ రామ్ చరణ్‌కి ఎస్ ఎస్ రాజమౌళి ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. మగధీర మూవీ సక్సెస్‌తో రామ్ చరణ్‌కి జై జై లు కొట్టినా.. అప్పటికి చరణ్‌ని హీరోగా చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆ తర్వాత ఆరెంజ్ లాంటి డిజాస్టర్ పడడంతో ఆ విమర్శలు మరింతగా ఎక్కువయ్యాయి. రచ్చ లాంటి సినిమాతో హీరోగా షైన్ అయిన రామ్ చరణ్‌కి మళ్ళీ వినయ విధేయ రామతో భారీ డిజాస్టర్ పడింది. ఆ సినిమాలో రామ్ చరణ్ మేకోవర్ కి మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ రాజమౌళి చేతిలో పడ్డారు.

 

ట్రిపుల్ ఆర్‌తో రాజమౌళి మళ్ళీ రామ్ చరణ్ ని అల్లూరిగా అందనంత ఎత్తులో నించోబెట్టడమే కాదు.. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో బర్త్ డే కి గ్రాండ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ రోజు రామ్ చరణ్ తన బర్త్ డే ని ఆర్ ఆర్ ఆర్ బ్లాక్‌బస్టర్ టాక్ తో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ పోలీస్ కేరెక్టర్ అలాగే, అల్లూరి కేరెక్టర్‌లో చెలరేగిపోయి నటించారు. అలాగే సిక్స్ ప్యాక్ బాడీ‌తో రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. రామ్ చరణ్ మేకోవర్ కి ముగ్దులయ్యారు. ఆర్ ఆర్ ఆర్ హిట్ తో రామ్ చరణ్ నేడు తన పుట్టిన రోజుని స్పెషల్ గా ఫ్యామిలీతో అండ్ ఆయన ఫ్రెండ్ ఎన్టీఆర్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. సో నేడు బర్త్ డే జరుపుకుంటున్న స్టార్ హీరో రామ్ చరణ్ కి సినీ జోష్ తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Ram Charan gets One More Blockbuster with RRR Movie:

Ram Charan Celebrates His Birthday with Blockbuster Mood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ