మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత మెగాస్టార్ బర్త్ డే రోజున కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ ఫోటో షూట్ తో ఫాన్స్ కి కిక్ ఇచ్చారు. కానీ రిపబ్లిక్ తర్వాత సాయి ఏజ్ సినిమా అప్ డేట్ కానీ, ఆయన హెల్త్ విషయం కానీ బయటికి రాలేదు. అయితే కొన్ని రోజులుగా స్పెషల్ మేకోవర్ తో హడావిడి చేస్తున్న సాయి తేజ్ తన తదుపరి మూవీని మేనమావ పవన్ కళ్యాణ్ తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో తమిళ్ హిట్ మూవీ ని రీమేక్ చెయ్యబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే సాయి తేజ్ ఫిజికల్ గా స్ట్రాంగ్ అయినా.. ఆయన వాయిస్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారని, సాయి తేజ్ కి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓకల్ కార్డు ఆపరేషన్ జరిగింది అని, అందుకే సాయి తేజ్ ఇంతవరకు మాట్లాడకుండా జస్ట్ ఫోటో షూట్స్ మాత్రమే వదులుతున్నారని, స్పీచ్ థెరపీతో సాయి తేజ్ మళ్ళీ మాములు స్థితికి వచ్చాడంటూ ఏవేవో కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే రీసెంట్ గా సాయి తేజ్ వీడియో తో ఫాన్స్ ని సర్ ప్రైజ్ చెయ్యడమే కాదు, తన తదుపరి సినిమా విషయమై అప్ డేట్ ఇచ్చి అభిమానులని ఖుషి చేసారు. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి మాట్లాడిన సాయి తేజ్.. తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రీట్ చేసిన డాక్టర్స్, అపోలో వైద్యులు, అలాగే మేనమావలు చిరు, పవన్ కి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు చెప్పిన సాయి తేజ్.. తన ఈ నెల 28న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని.. సుకుమార్, బాబీలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు అని సాయి తేజ్ ఫాన్స్ కి స్వీట్ న్యూస్ చెప్పారు. త్వరలోనే అందరి ముందుకు వస్తా అంటూ సాయి తేజ్ ఆ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇక ఇన్ని రోజులు ఇంట్లో ఉండడం వలన చాలా విషయాలు నేర్చుకున్నా అని, ముఖ్యంగా హెల్త్ పై దృష్టి పెట్టడానికి సమయం దొరికింది అని చెప్పిన సాయి తేజ్ ఇక బైక్‌పై వెళ్లే ప్రతిఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించాలని ఆయన ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ అభ్యర్థించారు.