Advertisementt

జబర్దస్త్ లో రోజా జేడ్జా.. కమేడియనా..

Sat 26th Mar 2022 09:49 PM
mla roja,roja,jabardasth,extra jabardasth  జబర్దస్త్ లో రోజా జేడ్జా.. కమేడియనా..
MLA Roja comedy skits in Jabardasth జబర్దస్త్ లో రోజా జేడ్జా.. కమేడియనా..
Advertisement
Ads by CJ

ఈటీవీలో గురు, శుక్రవారాల్లో ప్రసారం అయ్యే కామెడీ షోస్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లు అంటే కామెడీ ఫాన్స్ కి మంచి క్రేజ్. కాకపోతే ఈమధ్యన జబర్దస్త్ చూస్తున్నవారికి ఆ షో లో కామెడీ తగ్గింది, కమెడియన్స్ తగ్గారు.. స్కిట్స్ చేసే వారే కనిపించడం లేదు అంటున్నారు. కమెడియన్స్ చాలామంది సిల్వర్ స్క్రీన్ కి అలాగే స్టార్ మా కామెడీ స్టార్స్ కి జంప్ అవ్వడంతో జబర్దస్త్ లో కామెడీ చేసే వారే లేకపోయిరి. దానితో రోజా కూడా స్కిట్స్ చేసేస్తుంది. కాస్ట్లీ జేడ్జ్ గా జబర్దస్త్ లో కొనసాగుతున్న రోజా.. ఇప్ప్పుడు స్కిట్స్ తో కామెడీ చేస్తూ కనిపించడంతో అసలు జబర్దస్ కి రోజా జేడ్జా లేదంటే కమేడియనా అనే అనుమానం కలుగుతుంది ప్రేక్షకుల్లో. 

స్కిట్స్ చెయ్యడానికి కమెడియన్స్ లేక స్పెషల్ స్కిట్స్ పేరుతొ రోజా జబర్దస్త్ లో కామెడీ చేస్తుంది. ఆమెతో పాటుగా సీనియర్ నటి ఆమని, ఆఖరికి కొత్తగా ఎంటర్ అయిన లైలా కూడా కామెడీ చెయ్యడం నిజంగా విచిత్రంగా ఉంది. ఇక రోజా అటు ఎమ్యెల్యే గా ఉంటూనే జబర్దస్ కామెడీ షో కి జేడ్జ్ గా వస్తుంది. ఇది నాకు అచ్చోఇచ్చిన షో కాబట్టి నేను ఎమ్యెల్యే అయినా వదులుకోను అని ఖచ్చితంగా చెప్పింది. ఇక జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోతున్నారు కమెడియన్స్. దానికి రోజా జేడ్జ్ గా నవ్వుతూ మార్క్ లు వెయ్యడం చూసి చాలామంది రోజాని తప్పుబట్టారు. ఇక ఇప్పుడు రోజా ఏపీలో జగన్ మంత్రివర్గంలోకి చేరబోతోంది అంటున్నారు. మరి మంత్రి అయ్యాక కూడా రోజా జబర్దస్త్ జేడ్జ్ గాను, అలాగే కమేడియన్ గాను కొనసాగుతుందో లేదంటే మంత్రి గారికి మచ్చేందుకు అని జబర్దస్త్ వదిలేస్తుందో చూడాలి. 

MLA Roja comedy skits in Jabardasth:

Jabardasth and Extra Jabardasth 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ