Advertisementt

అలియాని ఏంటి బాస్ అలా చేసారు

Fri 25th Mar 2022 04:49 PM
alia bhatt,rrr,cameo appearance,ntr,ram charan,rajamouli  అలియాని ఏంటి బాస్ అలా చేసారు
Is Alia Bhatt playing a guest role in RRR? అలియాని ఏంటి బాస్ అలా చేసారు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ ట్రిపుల్ ఆర్ లో కీలక పాత్రలో కనిపిస్తుంది.. సీత లుక్ తోనే అలియా భట్ కేరెక్టర్ కి విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి సారు.. ఎత్తర జెండా అనే ప్రమోషనల్ సాంగ్ లోను అలియా ని అంతే అందంగా చూపించారు. ఇక అలియా భట్ కూడా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో తన బెస్ట్ ఇచ్చింది. ఇక సీత గా ట్రిపుల్ ఆర్ లో అలియా లుక్ చూసాక రామ్ చరణ్ కి అలియా పర్ఫెక్ట్ పెయిర్.. వాళ్ళ కాంబో సీన్స్ అదిరిపోతోంది అనుకున్నారు. కానీ విజయేంద్ర ప్రసాద్ అలియా రోల్ కేవలం 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది అని చెప్పాక కొద్దిగా డిస్పాయింట్ అయిన ఫాన్స్.. తర్వాత అలియా భట్ సినిమాకి కీలకం అని తెలిసి ఖుషి అయ్యారు. 

కానీ ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక అలియా కేరెక్టర్ చూసిన వాళ్లకు ఆలియాభట్ హీరోయిన్ కి తక్కువ, గెస్ట్ ఆర్టిస్టుకి ఎక్కువ అన్నట్టుంది.. అసలు రామరాజు కేరెక్టర్ తో రొమాన్స్ లేదు, ఓ డ్యూయెట్ లేదు.. ఎమోషనల్ గా కట్టిపడేసే యాక్టింగ్ లేదు.. కేవలం సీతగా లుక్స్ విషయంలో హైలెట్ అయ్యింది తప్ప, బాలీవుడ్ నుండి హీరోయిన్ అయితే అక్కడ వెయిట్ వస్తుంది అని అందుకే ఇలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మాత్రం అలియా ఎందుకు బాస్ ఎవ్వరైనా ఓకె అంటున్నారు. అసలు ఎన్టీఆర్ కి అలియా భట్ హెల్ప్ చెయ్యడం ఏమిటండి, అలియా కి ఎన్టీఆర్ హెల్ప్ చెయ్యాలి గాని అంటున్నారు మరికొందరు. అది చూసి అలియా భట్ ఫాన్స్.. అలియా ని మరీ ఏంటి బాస్ అలా తీసేసారు అంటున్నారు.

Is Alia Bhatt playing a guest role in RRR?:

Is Alia Bhatt role in RRR a mere cameo appearance?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ