Advertisementt

ట్రిపుల్ ఆర్ మూవీ చూస్తూ అభిమాని మృతి

Fri 25th Mar 2022 03:55 PM
andhra pradesh,rrr movie,movie lovers,fans,fan dies,rrr movie review  ట్రిపుల్ ఆర్ మూవీ చూస్తూ అభిమాని మృతి
Fan dies while watching RRR movie ట్రిపుల్ ఆర్ మూవీ చూస్తూ అభిమాని మృతి
Advertisement
Ads by CJ

దేశం మొత్తం ట్రిపుల్ ఆర్ ఫీవర్ తో కొట్టేసుకుంటుంది. ఫాన్స్, ప్రేక్షకులు అంతా ట్రిపుల్ ఆర్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ వెయిట్ చేసారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు ట్రిపుల్ ఆర్ మూవీ ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ రోజు తెల్లవారి ఝము నుండే ట్రిపుల్ బెన్ఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ అంటూ ఫాన్స్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. బ్యానెర్లు కి, కటౌట్స్ కి పూలాభిషేకాలు, పాలభిషేకాలు, భారీ కటౌట్స్ పెట్టి పూజలు అబ్బో మాములుగా లేదు ట్రిపుల్ ఆర్ థియేటర్స్ దగ్గర.

అయితే ఈ హడావిడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఓ విషాదం చోటు చేసుకుంది. అనంతపురంలోని SV మ్యాక్స్ థియేటర్‌లో బెనిఫిట్ షో చూస్తూ ఉండగా ఓబులేసు అనే అభిమానికి గుండెపోటు రావడంతో అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే ఆ అభిమాని మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పడంతో అనంతపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Fan dies while watching RRR movie:

Andhra Pradesh: Fan dies while watching RRR movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ