బాహుబలితో పాన్ ఇండియాలో రికార్డులను వేటాడిన రాజమౌళి.. ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబోలో ట్రిపుల్ ఆర్ అంటూ ఎనౌన్స్ చేసినప్పటి థ్రిల్, అంతటి ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విడుదల సమయంలోనూ కనిపించడం నిజంగా హర్షించదగ్గ విషయం, పలు కారణాలతో డేట్స్ చేంజ్ చేసుకుంటూ చివరికి పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రిపుల్ ఆర్ పై ఫాన్స్ కి ఉన్న అనుమానాలు, ఆవేదన, ఆత్రుత అన్నిటిని రాజమౌళి తునాతునకలు చేసారు. ట్రిపుల్ మ్యానియాతో ఏ హీరో గొప్ప అన్న ఫాన్స్ కి రాజమౌళి కొమరం భీమ్, అల్లూరి కేరెక్టర్ తో సమాధానం చెప్పారు. కొమరం భీమ్ గా తారక్, అల్లూరిగా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ అంటూ ఫాన్స్ చెబుతుంటే.. ఆ స్టార్ హీరోలకి అంతకన్నా కావాల్సింది ఏముంది.
ట్రిపుల్ ప్రీమియర్స్ పూర్తవడంతో సినిమా చూసిన ఎన్టీఆర్-చరణ్ ఫాన్స్.. ఆనందంగానే బయటికి వచ్చారు. కానీ వాళ్లలో రామ్ చరణ్ కేరెక్టర్ ఎలివేషన్ అంతగా ఎన్టీఆర్ కొమరం భీమ్ లేదేమో అనే చిన్న డౌట్. అది కూడా తారక్ అమాయకపు ట్రైబల్ గా లుక్స్ విషయంలో కాస్త డిఫ్రెంట్ గా ఉండడం, అలాగే చరణ్ ని అన్నా అన్నా అని పిలవడం కొద్దిగా ఎన్టీఆర్ ఫాన్స్ హర్టింగ్ గా ఉంది. ఇక చరణ్ పోలీస్ లుక్ లో, నీట్ షేవ్ చేసుకుని హైలెట్ అయ్యాడు. అంతేకాకుండా అల్లూరి గెటప్ చరణ్ ని మరింతగా ఎలివేట్ చేసింది. ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప ఎన్టీఆర్-రామ్ చరణ్ పాత్రల్లో ఎలాంటి హెచ్చు తగ్గులు లేవని, ఎన్టీఆర్ కి చరణ్ కి సరిసమానమైన కేరెక్టర్ రాజమౌళి ఇచ్చారని, నిజంగా రాజమౌళి చెప్పినట్టుగా ఒకసారి ట్రిపుల్ ఆర్ లో ఇన్వాల్వ్ అయ్యాక అందులో చరణ్ ఎక్కువ, ఎన్టీఆర్ ఎక్కువ అనేది ఎవరూ ఆలోచించనంతగా ట్రాన్స్ లోకి తీసుకెళ్లారు అంటున్నారు ఫాన్స్.
పోలీస్ స్టేషన్ వద్ద గ్రామస్తులతో రామ్ చరణ్ తలపడే యాక్షన్ సీన్, అదిలాబాద్ అడవుల్లో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఇరువురి అభిమానులకు కిక్కిచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇంకా రామ్, భీమ్ మధ్య ఫ్రెండ్‌షిప్ సీన్స్ ట్రిపుల్ ఆర్ కథలో ప్రధాన బలమని, ఇంటర్వెల్ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్ అటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ ముక్త ఖంఠంతో చెబుతున్నారు.